
నగదు రహిత లావాదేవీలతో ఆర్థికాభివృద్ధి
– కలెక్టర్ కేవీ సత్యనారాయణ
ముద్దనూరు: నగదు రహిత లావాదేవీలతో ఆర్థికాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు.సిండికేట్ బ్యాంకు దత్తత గ్రామమైన యామవరంను నగదు రహిత లావాదేవీల గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రసంగిస్తూ నోట్ల రద్దుతో ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుంచి కోలుకోవడానికి నగదు రహిత లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ లిటరసీలో శిక్షణ, రూపే కార్డుల వినియోగం,స్వైప్‌మిషన్‌ల ఏర్పాటు తదితర మార్గాలను అనుసరిస్తున్నామన్నారు. జిల్లాలో 3,89,000 జన్‌ధన్ ఖాతాలున్నాయని, రూపే కార్డులు మంజూరు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. యామవరం గ్రామాభివృద్ధిలో భాగంగా చెరువు మరమ్మతులు , శ్మశాన వాటికల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, సిమెంటు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తాని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దుతో అవినీతి తగ్గుతుందన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సిండికేట్ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఆర్డీవో వినాయకం, సిండికే ట్ బ్యాంకు జనరల్ మేనేజరు మోహన్‌రెడ్డి, డీజీఎం ఆశీర్వాదం, ఎఫ్‌జీఎంవో శర్మ, ఏజీఎంలు పాణిగ్రాహి, విశ్వనాథరెడ్డి, బ్రాంచి మేనేజరు ఓబులేసు, తహసీల్దారు రమ, ఎంపీడీవో మనోహర్‌రాజు, సర్పంచ్ లక్ష్మీకాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.