గ్రామాల అభివృద్ధికి కృషి
గ్రామాల అభివృద్ధికి కృషి
Published Fri, Sep 9 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
కేతేపల్లి : మారుమూల గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తున్నట్టు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని ఇనుపాములలో శుక్రవారం రూ.13 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆనంతరం నూతనంగా నిర్మించిన గోపాలమిత్ర భవనం, జెడ్పీహెచ్‌ఎస్‌లో అదనపు గదులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనlప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందజేస్తుమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల అహాల్యదయాకర్‌రెడ్డి, ఎంపీటీసీ శైలజసాగర్, ఉపసర్పంచ్ డి.సైదులు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, నాయకులు మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, రవీందర్‌రెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement