ఎన్నికల హామీలు అమలు చేయకుంటే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ళు ముట్టడి
Published Mon, Oct 3 2016 9:56 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
ఏలూరు(సెంట్రల్)ః
రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువకులను మోసం చేసి అధికారం చేపట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు అన్నారు. ఎన్నిక ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వసంతమహాల్, ఫైర్‌స్టేçÙన్ సెంటరు, జెడ్పీ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టేందుకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, యువకుల ఓట్లు దండుకోవడం కోసం బాబు వస్తే.. జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం, లేని పక్షంలో నిరుద్యోగ భత్తి ఇస్తామని హామీలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న హామీలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. చంద్రబాబుకు వయస్సు పైబడిన కారణంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఉంటే యూత్ కాంగ్రెస్ తరుపున గుర్తు చేస్తున్నామని ఆయన హేలన చేశారు. చంద్రబాబు పాలన తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రెండున్న సంవత్సరాల్లో టీడీపీ పాలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. ఇప్పటికైన ఎన్నికల ముందు ఇచ్చిన ∙హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేయడంతో పాటు, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ళును ముట్టడిస్తామని సుబ్బారావు హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సవరం రోహిత్, ఎ.సీతారాం, గెడ్డం ప్రశాంత్, నీలపు మధుసుధనరావు, మాజీ మేయరు కారే బాబురావు, నాయకులు రాజనాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement