శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను తప్పులు లేకుండా తయారు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు సూచించారు.
ఓటర్ల జాబితాలోని తప్పులను సవరించండి
Feb 9 2017 12:38 AM | Updated on Jul 11 2019 7:48 PM
–తహసీల్దార్లు, ఆర్డీఓలకు డీఆర్‌ఓ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను తప్పులు లేకుండా తయారు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా ఓటర్ల జాబితాల తయారీపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాబితాలో ఉన్న తప్పులను సరిచేయాలని, ఎలాంటి తప్పులు లేని 100 శాతం ఓటర్ల ఫొటోలతో జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, తప్పుల సవరణలపై దృష్టి సారించాలని, ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. వీసీలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, ఎన్నికల సెల్ సూపరింటెండెంటు ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement