ములకలచెరువు (చిత్తూరు) : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ములకలచెరువు మండలం వేపురికోట పంచాయతీ బత్తలాపురంలో ఉండే రవిచంద్ర(45) తిరుపతిలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం అతడు మదనపల్లి వైపు తన బైక్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలోనే బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రవిచంద్ర అక్కడికక్కడే చనిపోయాడు.