విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer dead with curent shack | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Fri, Sep 9 2016 10:06 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer dead with curent shack

కోరుట్ల రూరల్‌ : విద్యుదాఘాతంతో కరీంనగర్‌ జిల్లాలో ఓ రైతు మృతిచెందాడు. కోరుట్ల మండలం అయిలాపూర్‌ గ్రామానికి చెందిన గుర్రాల రాంరెడ్డి (43) శుక్రవారం ఉదయం తన మక్కచేనుకు నీళ్లు పారించేందుకు వెళ్లాడు. విద్యుత్‌ సరఫరాలేక పోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను హ్యాండిల్‌ సహాయంతో ఆన్‌ చేసేందుకు యత్నించాడు. ప్రమాదవశాత్తు హ్యాండిల్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో రాంరెడ్డి కిందపడి అక్కడిక్కడే మృతిచెందాడు. రైతు కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని పలువురు రైతులు డిమాండ్‌ చేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement