రైతుల ఆందోళన ఉధృతం
-
పరిశ్రమలకు భూములిచ్చేది లేదంటూ నిరసన
-
lఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు
గీసుకొండ : పరిశ్రమల పేరుతో భూములను బల వంతంగా లాక్కోవాలని చూస్తున్నా్నరని ఆరోపిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్పింది. మండలంలోని ఊకల్æహవేలీ, శాయంపేట హవేలీ, సంగెం మండలం స్టేషన్ చింతలపెల్లి, కృష్ణానగర్ గ్రామాల రైతులు బుధవారం సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వద్ద నిరసన తెలిపారు. అంతేకాకుండా ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలో పుచ్చ రాజన్న, రామస్వామి, దం డు యుగేందర్, వేల్పుల లచ్చయ్య, ఐలయ్య, దండి కుమారస్వామి, కుమారస్వామి, సమ్మయ్య, కొమురయ్య, నర్సింగరావు, టి.రవీందర్ కూర్చున్నారు. దీక్షలకు మోర్తాల చందర్‌రావు, సోమిడి శ్రీనివాస్, రమేశ్, రాజేందర్, బీరం రాములు, బాబు, రంగారెడ్డి, చిన్ని, శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు.
ఎమ్మెల్యేకు రైతుల నిరసన సెగ..
మండలంలోని శాయంపేట హవేలీలి రైతులు పరిశ్రమలకు తమ భూములను ఇవ్వబోమంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎదుట నిరసన తెలిపారు. శాయంపేట హవేలీకి ఎమ్మెల్యే.. వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరెడ్డి, గీసుకొండ తహసిల్దారు శ్రీనివాస్‌తో కలిసి వెళ్లారు. పరిశ్రమల స్థాపన వల్ల మేలు కలుగుతుందని వివరించడానికి ప్రయత్నించగా.. కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే చెప్పినా రైతులు వినలేదు. ఈ మేరకు పలువురు వెళ్లిపోగా మిగిలిన రైతులతో ఎమ్మెల్యే మాట్లాడారు. అసైన్‌మెంట్ భూమి ఉంటే రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకుంటుందని, పరిశ్రమలకు అప్పజెప్పే భూముల ధరల విషయంలో తనతో చర్చిస్తే వారికి మేలు జరిగేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మామునూరు సీఐ శ్రీనివాస్, గీసుకొండ ఎస్‌ఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటుచేయగా సర్పంచ్‌లు కొంగర చంద్రమౌళి, కోల కుమారస్వామి, జక్కు మురళి, టీఆర్‌ఎస్ నాయకులు ముంత రాజయ్య, ధర్మారావు, పి.జయపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, అంకతి నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.