ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తాం
-
దాని కోసమే పదవిలో కొనసాగుతున్నా
-
రఘునాథపాలెం నేను సృష్టించిన మండలమే
-
ప్రతి తండాలో సీసీ, బీటి రోడ్లు వేయడమే లక్ష్యం
-
వేపకుంట్ల సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం:
జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరు అం దిస్తామని దాని కోసమే తాను పదవిలో కొన సాగుతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని వేపకుంట్ల గ్రామంలో రూ. 70 లక్షలతో వివిధ గ్రామాల్లో చేపడుతు న్న సిమెంట్ రోడ్లు పనులకు శంకుస్థాపన చేసి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కుర్రా భాస్కర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారి కి మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరం సస్యశ్యామలం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
అభివృద్ధికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం..
రోడ్లు, తాగునీరు, రైతులకు సాగునీరు కల్పనకు టీఆర్‌ఎస్ తొలిప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.ఇప్పటికే మండ లపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసు కున్న రఘునాథపాలెం మండలానికి కొత్త జిల్లాలతో రెవెన్యూ, పోలీసు స్టేష¯ŒS మండల కార్యాలయాలను ఏర్పాటు చేసుకోని ప్రజలకు పరిపాలన మరింత దగ్గరకు చేర్చబోతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే బాలసాని లకీ‡్ష్మనారాయణ, జెడ్పీ చైర్‌పర్స¯ŒS గడిపల్లి కవిత, జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బేగ్, నియోజకవర్గ ఇ¯ŒSచార్జీ ఆర్జేసీ కృష్ణ, జెడ్పీటీసీ ఆజ్మీరా వీరునాయక్, ఎంపీపీ మాలోత్ శాంత, ఎంపీటీసీ రెంటాల ధానయ్య, సొసైటీ అధ్యక్షుడు తాతా రఘురాం, రావెళ్ల శ్రీనివాసరావు , కార్పొరేష¯ŒS డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ,కార్పొరేటర్ కమర్తపు మురళీ, ఆత్మ చైర్మ¯ŒS మెంటం రామారావు, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, మాజీ సొసైటీ అధ్యక్షుడు మం దడపు నరసింహారావు, యరగర్ల హనుమం తురావు, ఆవుల కొదండరాములు, ఎంపీడీఓ శ్రీనవాసరావ తహసీల్దారు శ్రీలత పాల్గొన్నారు.
బుగ్గవాగుపై రూ.20 కోట్లతో చెక్ డ్యాం..
ఖమ్మం అర్బ¯ŒS మండలంలోని చెరువులన్నింటికి సాగు నీరు అందించాడానికి రూ. 20 కోట్లతో బుగ్గ వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.జిల్లాలో శాశ్వత కరువు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రతి తండాకు సీసీ, తారు రోడ్డు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.