కూలీ కుటుంబాలకు గరిష్టంగా రూ.12.54 లక్షలు | The maximum wage of Rs .12.54 lakh to families | Sakshi
Sakshi News home page

కూలీ కుటుంబాలకు గరిష్టంగా రూ.12.54 లక్షలు

Published Thu, Aug 11 2016 2:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కూలీ కుటుంబాలకు గరిష్టంగా రూ.12.54 లక్షలు - Sakshi

కూలీ కుటుంబాలకు గరిష్టంగా రూ.12.54 లక్షలు

కనిష్టంగా రూ.8.75 లక్షల పరిహారం
123 జీవోకు అదనంగా కొత్త జీవో
ముసాయిదా సిద్ధం చేసిన రెవెన్యూ


హైదరాబాద్: భూ సేకరణ వివాదానికి తెర దించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 123 జీవో ద్వారా సేకరించే భూముల వల్ల జీవనాధారం కోల్పోయే వారికి హైకోర్టు తీర్పు మేరకు సంక్షేమ ప్రయోజనాలు కల్పించడంతో పాటు వాటిని సవివరంగా పొందుపరుస్తూ మరో ఉత్తర్వు జారీ చేయాలని నిర్ణయించింది. సంబంధిత ముసాయిదాను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగం బుధవారం సిద్ధం చేసింది. త్వరలో ఈ జీవోను జారీ చేయనుంది. ప్రధానంగా వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందని  పేర్కొంది. సొంతంగా భూమి లేని వారు, మూడేళ్లకుపైగా అదే ప్రాంతంగా నివాసముంటున్న కుటుంబాలకు ఈ ప్రయోజనాలు కల్పిస్తామని అందులో స్పష్టం చేసింది. ముసాయిదా జీవోలో పొందుపరిచిన ప్రయోజనాలు...

►బాధిత కుటుంబానికి రూ.5.04 లక్షలు (డబుల్ బెడ్రూం పథకంలో ఇంటి నిర్మాణానికి అయ్యే విలువ). అవివాహితులకైతే రూ.1.25 లక్షలు (ఇందిరా ఆవాస్ యోజన పథకంలో ఇంటి విలువ)

►సంబంధిత ప్రాజెక్టు ద్వారా ఉద్యోగాల కల్పన జరిగితే అవి అందుబాటులోకి రాగానే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. నైపుణ్య శిక్షణ ప్రభుత్వమే ఇస్తుంది/లేదా ఒకే విడత రూ.5 లక్షల నగదు పరిహారం/లేదా 20 ఏళ్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ.3000, ఇతర వర్గాల వ్యవసాయ కూలీలకు నెలకు రూ.2500 చొప్పున జీవన భృతిహా ఏడాది జీవన భృతిగా రూ.40 వేలు. షెడ్యూలు ఏరియాలో ఎస్సీ, ఎస్టీ లకు ఒకే విడత గ్రాంట్‌గా రూ.60 వేలు


►బాధిత కుటుంబాన్ని మరో చోటికి తరలించే పక్షంలో రవాణా ఖర్చులకు రూ.60 వేలు


► చేతి వృత్తుల కళాకారులు, చిన్న వ్యాపారులు, సంప్రదాయ వృత్తికారులు, స్వయం ఉపాధి పొందే వారికి ఒకే విడత సాయంగా రూ.30 వేలుహా పునరావాస సాయం కింద బాధిత కుటుంబానికి రూ.60 వేలుహా చేపలు పట్టే వారికి  ప్రాజెక్టు పరిధిలో చేపల హక్కులు


► వీటన్నింటికీ బదులుగా బాధిత కుటుంబం స్వయం ఉపాధి యూనిట్ గానీ, సొంత వ్యాపారం గానీ, ఆదాయం తెచ్చిపెట్టే జీవనోపాధి పథకం గానీ ప్రారంభించదలిస్తే ప్రభుత్వం టోకున రూ.7.5 లక్షలు ఆర్థిక సాయంగా అందిస్తుంది. ఈ సాయం పొందే వారికి ఇల్లు మినహా ఈ జీవోలో సూచించిన మిగతా ఆర్థిక ప్రయోజనాలేవీ వర్తించవు. మొత్తమ్మీద బాధిత కుటుంబ కనిష్టంగా రూ.8.75 లక్షలు, గరిష్టంగా రూ. 12.54 లక్షల ప్రయోజనం పొందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement