విద్యుత్‌సిబ్బందిని నిర్బంధించిన రైతులు
Published Sun, Oct 16 2016 2:00 PM | Last Updated on Wed, Sep 5 2018 4:03 PM
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవ డంతో.. సబ్‌స్టేషన్ పరిధిలోని నాలుగు గ్రామాలకు చెందిన రైతులు ఈ రోజు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. ఆగ్రహించిన రైతులు సిబ్బందిని గదిలో వేసి తాళంవేశారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు సర్ది చెప్పడానికి యత్నిస్తున్నారు.
Advertisement
Advertisement