మైనింగ్ పనులను అడ్డుకున్న రైతులు
కన్నపుకుంటలోని 570 /5 సర్వేనెంబర్‌లో రెవెన్యూ, గనులు, భూగర్భశాల అధికారుల మైనింగ్ లీజును మంజూరు చేయడం మూలంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ ప్రాంతం రైతులు ఆందోళన చేపట్టారు.
డోన్ టౌన్ : కన్నపుకుంటలోని 570 /5 సర్వేనెంబర్‌లో రెవెన్యూ, గనులు, భూగర్భశాల అధికారుల మైనింగ్ లీజును మంజూరు చేయడం మూలంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ ప్రాంతం రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం మైనింగ్ ప్రాంతంలో జరగుతున్న బ్లాస్టింగ్ పనులను అడ్డుకుని అక్కడే ధర్నాకు దిగారు. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో లీజుదారుడు శ్రీనివాసులు పనులను ఆపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈసందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ బఫర్‌జోన్ ఏర్పాటు చేయకుండానే అధికారులు పంట పొలాలను ఆనుకొని మైనింగ్‌లీజును ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. తమ సమస్య పరిష్కరించే వరకూ కదలేది లేదని భీష్మించారు. ఇదిలా ఉండగా రైతులు మైనింగ్ యజమానుల మధ్య వివాదం కోర్టులో ఉన్నట్లు తహసీల్దార్ మునికృష్ణయ్య తెలిపారు. లీజు మంజూరుకు సంబంధించి ఎన్‌ఓసీ ఇచ్చినట్లుగా తమ వద్ద రికార్డులు లేవన్నారు. ఈ విషయంలో తామేమీ చేయలేమని స్పష్టం చేశారు.