-
కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసుల ఎదురుచూపు
-
రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశ
-
వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని రైతుల విజ్ఞప్తులు
-
పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్
మరో ఏడాదిపాటు దేశ భవితను శాసించే బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రాధాన్యరంగమైన వ్యవసాయానికి పెద్దపీట వేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు తగినన్ని నిధులు కేటాయించాలని ఆ పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు. అలాగే, జిల్లాలోని కోనసీమ, కాకినాడ మెయిన్ రైల్వే లైన్ ప్రాజెక్టులు త్వరగా పట్టాలెక్కేందుకు అవసరమైన స్థాయిలో నిధులు కేటాయించాలని జిల్లావాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కోరుతున్నట్టుగా కేంద్ర పాలకులు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు ‘చేస్తారా..?’ లేక ‘చేయి’స్తారా! అన్న ఉత్కంఠ నెలకొంది.
– సాక్షి, రాజమహేంద్రవరం / అమలాపురం / అమలాపురం టౌన్ / మండపేట
లైన్‌లో పడేనా.. పట్టాలెక్కేనా?
ప్రస్తుతం కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ రైల్వే లైను ఉంది. దీనిని నుంచి కోనసీమ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వరకూ మరో 57 కిలోమీటర్ల మేర పొడిగించడం ద్వారా ఆ ప్రాంతానికి రైల్వే సౌకర్యం ఏర్పడుతుంది. ఈ లైను నిర్మాణానికి రూ.15 వందల కోట్లు అవుతుందన్నది అంచనా. ఈ మార్గం పూర్తయితే ప్రయాణికులకే కాకుండా చమురు, గ్యాస్, ఇసుక, ధాన్యం తదితర సరుకుల రవాణా ద్వారా కూడా ఈ ప్రాంతం నుంచి రైల్వేకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశముంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. వాస్తవానికి ఒకటిన్నర దశాబ్దాల కాలంలో ఈ పెండింగ్ ప్రాజెక్టుకు అంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే ప్రథమం. దీంతో కోనసీమ రైలు పట్టాలెక్కుతుందన్న నమ్మకం కుదిరింది. అదే సమయంలో గత ఏడాది కాలంలో కోటిపల్లి – ముక్తేశ్వరం మధ్య గౌతమీ గోదావరి నదిపై రైల్వే వంతెన నిర్మాణానికి నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ మొదలు కావడంతో ఆ ఆశలు రెట్టింపయ్యాయి. కొంతవరకూ భూసేకరణ కూడా జరిగింది. రైల్వే వంతెనకు ఫిబ్రవరిలో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన స్థాయిలో నిధులు కేటాయించాలని కోనసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
l జిల్లా కేంద్రమైన కాకినాడను మెయిన్ రైల్వే లైనులో కలపాలన్నది నాలుగు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్. ప్రస్తుతం ఉన్న మెయిన్ లైన్ సామర్లకోట నుంచి నేరుగా పిఠాపురం మీదుగా వెళ్తుంది. దీనివల్ల కాకినాడ ఓ పక్కకు ఉండిపోతుంది. వాస్తవానికి ఇప్పటికే సామర్లకోట నుంచి కాకినాడ వరకూ రైల్వే లైను ఉంది. అక్కడనుంచి దీనిని పిఠాపురం వరకూ పొడిగిస్తే కాకినాడ మెయిన్ లైన్‌లోకి వచ్చేస్తుంది. 21 కిలోమీటర్ల ఈ లై¯ŒS నిర్మాణానికి 2000 సంవత్సరంనాటి అంచనా రూ.126 కోట్లు. ప్రస్తుతం అది రూ.250 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారు. గడచిన ఏడాది కాలంగా ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈసారి బడ్జెట్‌లో మరో రూ.50 కోట్లు కేటాయించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు అంచనాతో పోలిస్తే ఈ మొత్తం దేనికీ సరిపోని పరిస్థితి.
l కాకినాడ నుంచి వారణాసికి రైలు వేయాలని కొన్నేళ్లుగా జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లోనైనా ఈ రైలు పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.
స్వామినాథ¯ŒS సిఫారసులన్నీ అమలు చేసేలా..
వ్యవసాయ ఆదాయం రెట్టింపు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజంగా కోరుకుంటే.. స్వామినాథ¯ŒS కమిటీ సిఫారసులన్నీ అమలు చేసేలా కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి నిధులు కేటాయించాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ఈ బడ్జెట్‌పై రైతు ప్రతినిధుల ఆకాంక్షలేమిటంటే..
∙పెట్టుబడులకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధర ఇస్తానన్న కేంద్రం అరకొరగా పెంచుతోంది. మద్దతు ధర పడిపోయిన సమయంలో కేంద్రం నేరుగా కొనుగోలు చేసేందుకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను తక్షణం ఆదుకునేందుకు బడ్జెట్‌లో కనీసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి.
∙జిల్లాలో వరి సాగు ద్వారా ఏడాదికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుండగా, మనవద్ద దీనిలో మూడోవంతు మాత్రమే నిల్వ చేసే సామర్థ్యముంది. ఎఫ్‌సీఐ ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసేందుకు చిన్నచిన్న గోదాములు నిర్మించేందుకు నిధులు కేటాయించాలి.
∙జిల్లాలో అతి పెద్ద వాణిజ్య పంట కొబ్బరి సాగు గత ఏడాది తీవ్ర నష్టాల పాలైంది. ఈ రైతులకు చేయూతనిచ్చేలా కొబ్బరి ఆధారిత భారీ పరిశ్రమలు పెట్టేందుకు కేంద్రం నిధులు కేటాయించాలి. కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు (సీడీబీ) ద్వారా రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలిచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. కొబ్బరి, అరటి, ఆయిల్‌పామ్, కూరగాయ పంటల దిగుబడులను నిలువ చేసేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి భారీ రాయితీలు ఇవ్వాలి.
∙ఆక్వా పరిశ్రమకు దన్నుగా ఎగుమతుల్లో రాయితీలివ్వాలి. కోల్డ్ స్టోరేజ్‌లకు నిధులివ్వాలి.
పోల‘వరం’ ఇస్తారా?
జిల్లాలో మెట్ట, డెల్టా రైతులకు మేలు చేసే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. తాజా అంచనాల ప్రకారం రూ.40 వేల కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం నాబార్డు ద్వారా కేవలం రూ.2 వేల కోట్లు అప్పుగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదని, వచ్చే బడ్జెట్‌లో కనీసం రూ.15 వేల కోట్లయినా కేటాయించాలి.
నష్టాల భర్తీ కోసం ఎదురుచూపులు
పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన కోళ్ల పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు కోళ్ల రైతులు. కేంద్ర బడ్జెట్‌పై వారు గంపెడాశలు పెట్టుకున్నారు. తమ వినతులపై ఈసారి బడ్జెట్‌లోనైనా కేంద్రం వరాలు కురిపించాలని, పౌల్ట్రీ పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ఎదురు చూస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 1.3 కోట్ల కోళ్లుండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 40 శాతం జిల్లాలో వినియోగమవుతుండగా మిగిలినవి పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో ప్రస్తుత సీజ¯ŒS కోళ్ల రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. గుడ్డు ధర పతనం కావడం, మాంసం ధర తగ్గిపోవడం తదితర రూపాల్లో మునుపెన్నడూ లేనివిధంగా గడచిన రెండున్నర నెలల వ్యవధిలో పరిశ్రమకు రూ.60 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పరిశ్రమకు వాటిల్లిన నష్టం గురించి కోళ్ల రైతులు నెక్ ద్వారా ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. జరిగిన నష్టంపై విజిలె¯Œ్స శాఖ కూడా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
సబ్సిడీపై ఇవ్వాలి
ఎఫ్‌సీఐ సేకరించిన బియ్యం, జొన్న, మొక్కజొన్న, గోధుమలు తదితర ఆహార ధాన్యాల్లో పాడైనవాటిని బహిరంగ వేలం నిర్వహిస్తుంది. వీటిని బడా వ్యాపారులు వేలంలో దక్కించుకుని పౌల్ట్రీలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కోళ్ల మేతకు వినియోగించే ఆహార ధాన్యాలను బహిరంగ వేలంలో కాకుండా, పౌల్ట్రీ అసోసియేష¯ŒSకు సబ్సిడీపై అందించాలని ఎన్నో ఏళ్లుగా కోళ్ల రైతులు కోరుతున్నారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న మేతలకు స్థానికంగా పన్నులు వేయడాన్ని నిలిపివేయాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. వీటికి ఈ బడ్జెట్‌లో పరిష్కారం లభిస్తుందని పౌల్ట్రీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నాం
పెద్దనోట్ల రద్దుతో పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో గుడ్డుకు రూపాయి వరకూ, కేజీ కోడికి రూ.25 వరకూ నష్టపోతున్నాం. పాత నష్టాలు భర్తీ కాకపోగా కొత్తగా ఏర్పడిన నష్టాలతో ప్రస్తుతం పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పాడైన ఆహార ధాన్యాలకు వేలం నిర్వహించకుండా సబ్సిడీపై పౌల్ట్రీ అసోసియేష¯ŒSకు అందజేయాలని ఇప్పటికే రాష్ట్ర అసోసియేష¯ŒS ద్వారా కేంద్రాన్ని కోరడం జరిగింది. ప్రస్తుత బడ్జెట్‌లో పరిశ్రమను ఆదుకునే దిశగా కేంద్రం కేటాయిస్తుందని ఆశిస్తున్నాం.
– పడాల సుబ్బారెడ్డి, నెక్ జిల్లా చైర్మన్, ఏపీ పౌల్ట్రీ ఫెడరేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు
మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి
స్వామినాథ¯ŒS కమిటీ సిఫారసులన్నింటినీ అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో నిధులు పెద్ద ఎత్తున పెంచాలి. ఆర్‌కేవీవై స్కీమ్‌లో రాయితీని మోదీ ప్రభుత్వం 60 శాతానికి తగ్గించింది. దీనిని 100 శాతం పెంచాలి. ఎఫ్‌సీఐ ద్వారా గ్రామీణ ప్రాంతంలో గోడౌన్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి.
– జున్నూరి బాబీ, డీసీసీబీ మాజీ డైరెక్టర్,
డి.రావులపాలెం, అమలాపురం
కొబ్బరి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతోంది. ఈ చెట్ల ద్వారా ఏడాదికి 1,500 కోట్ల కాయ దిగుబడి వస్తోంది. సరైన పరిశ్రమలు లేక రైతులు రెండు మూడు ఉత్పత్తులుగా కొబ్బరి అమ్ముకోవాల్సి వస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కొబ్బరిని పలురకాల ఉత్పత్తులుగా చేసుకుని రైతులు విక్రయించుకోవచ్చు. రూ.50 కోట్ల నుంచి రూ.200 కోట్లు ఖర్చయ్యే పరిశ్రమలు ఏర్పాటు చేయడమంటే కేంద్ర ప్రభుత్వంవల్లే సాధ్యమవుతోంది.
– ముత్యాల జమ్మీ, బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
కొబ్బరి రైతు, అంబాజీపేట
ఎఫ్‌సీఐ గోడౌన్ల
తరహాలో కోల్డ్ స్టోరేజ్‌లు
బియ్యం నిల్వ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ గోడౌన్లను ఎలా నిర్మిస్తోందో.. ఆక్వా ఉత్పత్తుల నిల్వలకు కూడా జిల్లాలోని తీర ప్రాంతంలో భారీగా కోల్డ్‌స్టోరేజ్‌లను నిర్మించాలి. దేశీయ ఎగుమతుల్లో వచ్చే ఆదాయంలో ఆక్వా రంగం నుంచే ఎక్కువగా వస్తోంది. కోల్డ్‌స్టోరేజ్Sతోపాటు జిల్లాలోని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం, ఆక్వా పరిశ్రమకు ఊతం ఇచ్చేలా కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ, ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి.
– అల్లూరి రమేష్‌రాజు, అధ్యక్షుడు,
కోనసీమ ఆక్వా డీలర్స్ అండ్ ష్రింప్ డీలర్స్ అసోసియేష¯ŒS
చిన్న వర్తకులపై కరుణ చూపాలి
రెండున్నర సంవత్సరాల మోదీ పరిపాలన కారణంగా వర్తక, వాణిజ్య వర్గాలు దెబ్బతిన్నాయి. రిటైల్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు, పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు చితికిపోయారు. ఈసారైనా బడ్జెట్‌లో చిరు వ్యాపారులను ఆదుకునేవిధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
– అశోక్‌కుమార్‌జైన్, కన్వీనర్, ఏపీ ఫెడరేష¯ŒS చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ,
రాజమహేంద్రవరం
పన్నులు తగ్గించాలి
బంగారం వ్యాపారులకు సాధ్యమైనంత వరకూ పన్ను తగ్గించాలి. లేదంటే ఆ భారం ప్రత్యక్షంగా ప్రజలపై పడుతుంది. జీఎస్టీ ఎక్కువగా ఉంటే బంగారం కొనే మహిళలు ఇబ్బంది పడతారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనే సాధారణ, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించాలి.
– కడియాల శ్రీనివాస్, అధ్యక్షుడు,
రాజమహేద్రవరం గోల్డ్ మర్చంట్స్ అసోసియేష¯ŒS
వస్రా్తలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి
వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో వస్రా్తనికి పూర్తి మినహాయింపు ఇవ్వాలి. వీటితోపాటు ఆదాయపన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. నగదు విలువ మారుతున్నప్పుడు అన్నీ మారాల్సిన అవసరం ఉంది. పెద్దనోట్ల రద్దు వల్ల అత్యధికంగా నష్టపోయింది వస్త్ర వ్యాపారులే. వారిని ఆదుకోవాలి.
– పోకల సీతయ్య, ఉపాధ్యక్షుడు,
ఏపీ టెక్స్‌టైల్ ఫెడరేష¯ŒS, రాజమహేంద్రవరం