పట్టణంలోని కర్నూలు రోడ్డు వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్లో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.
ఒంగోలు: పట్టణంలోని కర్నూలు రోడ్డు వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్లో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేనప్పటికీ భారీగా ఆస్తి నస్ఠం సంభవించింది. పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి.
ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుచేసే షెడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. అయితే ఏ మేరకు ఆస్తి నష్టం జరిందనే వివరాలు ఇప్పుడు చెప్పలేమని అధికారులు తెలిపారు.