తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదం: భక్తులు సురక్షితం | Fire accident in tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్రోడ్డులో ప్రమాదం: భక్తులు సురక్షితం

Published Sat, Dec 19 2015 12:34 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in tirumala ghat road

తిరుమల: తిరుమల కనుమ రహదారిలో శనివారం ప్రమాదం తృటీలో తప్పింది. మొదటి కనుమ రహదారిలోని 35వ మలుపు వద్ద వ్యాన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ విషయాన్ని గమనించిన భక్తులు వాహనంలో నుంచి కిందకి దూకేశారు. ఆ వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు మంటల ధాటికి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే భక్తులంతా సురక్షితంగా ఉన్నారు. వారు మరో వాహనంలో తిరుపతి చేరుకున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement