రోడ్డు ప్రయాణంలో భద్రత పాటించండి
డీసీపీ విజేందర్‌రెడ్డి
జ్యోతినగర్ : రోడ్డు ప్రయాణంలో వాహనదారులు భద్రతా నియమాలను పాటించాలని పెద్దపల్లి జోన్ డీసీపీ విజేందర్‌రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్ రాజీవ్ రహదారిపై స్టాపర్స్ బోర్డుల ఏర్పాటును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరంమాట్లాడుతూ అతివేగంగా ప్రయాణించి ప్రమాదాలకు కారకులు కావద్దని సూచించారు. మనం చేసే ప్రమాదం ఇతరుల జీవితాలను చీకటిమయం చేయడం సరికాదన్నారు. వాహనాలు రానప్పుడు రోడ్డు దాటని సూచించారు.
స్టాపర్స్ బోర్డుల ఏర్పాటుకు సహకరించిన వారికి జ్ఞాపికలను అందజేశారు. మేడిపల్లి సెంటర్, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్, లేబర్ గేట్ వద్ద 12 స్టాఫర్స్‌ను ఏర్పాటు చేసిన రామగుండం సీఐ వాసుదేవరావును, ఎస్సై చంద్రకుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో విశ్వభారతి హైస్కూల్ కరస్పాండెంట్ బందారపు యాదగిరిగౌడ్, ఎస్‌ఎస్ గార్డెన్స్ యజమాని శరత్‌రావు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.