సైకిల్ నేర్పిస్తానని తీసుకెళ్లి..
సైకిల్ నేర్పిస్తానని తీసుకెళ్లి..
Published Sat, Jan 7 2017 10:58 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
రాజవొమ్మంగి(తూర్పుగోదావరి): సైకిల్ నేర్పిస్తానంటూ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడో కామాంధుడు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మండలంలోని కన్నయమ్మపేట గ్రామానికి చెందిన ఐదో తరగతి చదివే బాలిక(10)పై పొరుగింట్లో ఉండే వ్యక్తి చూపుపడింది.
వివాహితుడైన అతడు శుక్రవారం సాయంత్రం సైకిల్ నేర్పుతానంటూ బాలికను ఊరి బయట నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆపై ఇంటికి తీసుకువచ్చాడు. రాత్రి సమయంలో బాధితురాలు విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగికదాడి జరిగినట్లు తేల్చారు. బాలిక విషయం చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement