మాట్లాడుతున్న పర్వతాలు
అచ్చంపేట రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ ఇండస్ట్రీయల్ జిల్లా కన్వీనర్ పర్వతాలు ఆరోపించారు. గురువారం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక చట్టాలను సవరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గోపాల్, మల్లేష్, అల్వాల్‌రెడ్డి, గఫార్, శ్రీను, కలీం, మల్లయ్య, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.