పంటనష్ట పరిహారం అందజేయాలి | Give Craft exgratia | Sakshi
Sakshi News home page

పంటనష్ట పరిహారం అందజేయాలి

Published Thu, Aug 18 2016 7:30 PM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM

Give Craft exgratia

తాడూరు: రైతులకు పంటనష్ట పరిహారాన్ని అందించి ఆదుకోవాలని సింగిల్‌విండో చైర్మన్‌ ఎండీ. సమద్‌పాష ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెలరోజుల నుంచి వర్షాలు ముఖం చాటేయడం వల్ల మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయిందని, వారంరోజుల వ్యవధిలో వర్షాలు కురవకపోతే పత్తిపంట కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను గ్రామాలకు పంపించి పంటనష్టాన్ని అంచనా వేసి పంటనష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రెండు విడతల రుణమాఫీని ఒకేసారి చేసి రైతులకు కరువు నుంచి విముక్తి కల్పించాలంటే కొత్త రుణాలను వెంటనే ఇచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement