గోదావరి గలగల
♦ ‘దుబ్బాక’ను తడిపిన జలాలు
♦ మిషన్ భగీరథ ట్రయల్న్‌త్రో గ్రామస్తుల్లో ఆనందం
దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా నియోజకవర్గంలోకి గోదారమ్మ అడుగిడింది. గుక్కెడు నీటి కోసం నల్లాల వద్ద గంటల పాటు ఎదురు చూసే దురవస్థ ఇక తప్పనుంది. ఇదిగో, అదిగో అంటూ నెల రోజుల నుంచి ఊరిస్తూ వచ్చిన ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో శనివారం నియోజకవర్గ ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మిషన్‌భగీరథ పథకం ద్వారా గోదావరి జలాలను నియోజకవర్గంలో పారించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులతో పాటు స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎంతో కృషి చేశారు. ఓ వైపు ఎమ్మెల్యే మరోవైపు అధికారులు ఆహోరాత్రులు శ్రమించి పైపు లైన్ల ద్వారా దుబ్బాకకు తాగు నీటిని తీసుకొచ్చారు. వసంత రుతువులో లెంకలేసిన కాడెద్దులోలే.. గంతులేసిన లేడి కూనలోలే..గోదావరి నీటిని చూసిన నియోజకవర్గ ప్రజల్లో ఉత్సాహం రెట్టింపైంది.
మహిళలు, చిన్నారులు ఒకరిపై ఒకరు గోదావరి జలాలు చల్లుకుంటూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి అధికారులకు మిఠాయిలు తినిపించారు. మాలకుంట దళిత కాలనీకి సమీపంలో ఉండడంతో మొదటి సారిగా దళితులకే గోదావరమ్మను ముద్దాడే అదృష్టం దక్కింది. దౌల్తాబాద్ మండలం వడ్డెపల్లి వద్ద నిర్మించిన ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా దుబ్బాకలోని మాల కుంట సంపు వరకు శనివారం ఉదయం 11.15 గంటలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మహిళలు గోదావరమ్మకు హారతులు పట్టి స్వాగతం పలికారు. వేద మంత్రాల మధ్య గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి, జేజేలు పలికారు. ఎమ్మెల్యే 101 కొబ్బరి కాయలు కొట్టి నియోజక వర్గ ప్రజల రుణం తీర్చుకున్నారు.
నీళ్లొస్తాయన్న నమ్మకమైతే లేకుండే..
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రతి ఏడాది కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడే దుబ్బాక ప్రాంతానికి గోదావరి నీళ్లోస్తాయన్న నమ్మకమైతే లేకుండే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని గుండెలకు హత్తుకున్నారు. ఈ నెల 25లోగా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగు నీరందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కుటుంబంలోని ప్రతి సభ్యునికి 135 లీటర్ల తాగు నీటిని సరఫరా చేసి, నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రతి ఇంటి నుంచి బొట్టు, బోనం తీసుక రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రయల్న్‌ల్రో పాల్గొన్న కలెక్టర్ రోనాల్డ్ రాస్
నియోజకవర్గంలోని ట్రయల్న్ ్రకార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రోనాల్డ్ రాస్ మాల కుంట, బీసీ కాలనీలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 25లోగా అంతర్గత పైపులైన్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పైపు లైన్ల నిర్మాణ పనులు జేసీబీలతో సాధ్యం కాకపోతే గ్రామాల్లోని ఉపాధి కూలీలతో చేయించాలన్నారు.
ఉదయం11.15లకు చేరిన గోదారమ్మ
దుబ్బాకరూరల్ : ప్రజల దాహార్తిని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందిచడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. అదేవిధంగా రాష్ట్ర శాసన సభలో అంచనాల కమిటీ చెర్మైన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రాత్రనక పగలనక కష్టపడి గోదావరి జలాలు దుబ్బాక నియోజక వర్గానికి తీసుక రావాలనే కృషితో పని చేశారు. శనివారం దుబ్బాక నగర పంచాయితీ పరిధిలో చేపట్టిన ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో గోదావరి జలాలు ఉదయం 11.15లకు దుబ్బాకకు చేరుకున్నాయి. గోదావరి జలాలు చేరుకోవడంతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆనందంతో మురిసి పోయారు.
ఇటు అధికారులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు సంతోషంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. గోదావరి జలాల ట్రయల్న్ ్రచేయడంతో దుబ్బాక ప్రజలు అనందంతో మురిసి పోయారు. మహిళలు ఆనందంతో చిరునవ్వులు చిందించారు. గోదావరి జలాలను ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఉత్సాహంతో కలెక్టర్ రొనాల్డ్ రోస్‌ను ఆలింగనం చేసుకున్నారు.