
గోల్డ్ వాక్ ఫర్ చైల్డ్
బంజారాహిల్స్: చిన్నారులకు వచ్చే కేన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే నయం చేయొచ్చని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ‘గోల్డ్ వాక్ ఫర్ చైల్డ్’ పేరుతో పిల్లలకు వచ్చే కేన్సర్‌పై కేబీఆర్ పార్క్ వద్ద ఆదివారం అవగాహన నడక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాటికలు ప్రదర్శించి కేన్సర్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు మహమూద్ పాషా, అస్మాపాషా, తాజుద్దీన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.