సిద్దిపేటకు..నరసింహన్
♦ నేడు గవర్నర్ పర్యటన
♦ హరితహారంలో భాగస్వామ్యం
♦ ఇబ్రహీంపూర్ గ్రామస్తులతో ముఖముఖి
♦ నర్సరీలో ప్రజాప్రతినిధులతో భేటీ
సిద్దిపేట జోన్ రాష్ర్ట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తున్నారు. సుమారు 5 గంటల పాటు ఆయన సిద్దిపేట డివిజన్‌లో అధికారికంగా పర్యటిస్తారు. నియోజకవర్గంలో చేపట్టిన ప్రయోగాత్మక ఆదర్శపథకాలను గవర్నర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకోనున్నారు. అదే విధంగా ఇబ్రహీంపూర్‌ను, పట్టణంలోని పలుప్రాంతాలను గవర్నర్ సందర్శించి మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపూర్‌లో గ్రామస్తులచే ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, స్వచ్ఛ తెలంగాణ పేరిట చేపట్టిన పారిశుద్ధ్యంతో పాటు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతి రూపంగా నిలిచిన పథకాలపై ఆరా తీయనున్నారు. సుమారు 15 నిమిషాల పాటు గ్రామస్తులచే ముఖముఖిలో గవర్నర్ పాల్గొంటారు. అదే విధంగా నాగుల బండ, బంగ్లావెంకటాపూర్ నర్సరీలను గవర్నర్ సందర్శించి సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధలచే బేటీ అవుతారు. మంత్రి హరీష్‌రావు గురువారం సాయంత్రం గవర్నర్ పర్యటన వివరాలను వెల్లడించారు.
గవర్నర్ షెడ్యూల్ ఇలా...
⇔ 9.50కి రాజ్‌భవన్ నుంచి గవర్నర్ పయనం.
⇔ 9.55కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరిక
⇔ 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు హెలిపాడ్ నుంచి ఇబ్రహీంపూర్‌కు పయనం
⇔ 10.30కి ఇబ్రహీంపూర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
⇔ 10.35 నుంచి 11.45 వరకు ఇబ్రహీంపూర్‌లో నిర్వహించే హరితహారంలో పాల్గొంటారు.
⇔ 11.55కు ఇబ్రహీంపూర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిద్దిపేటకు పయనం.
⇔ 12.20కి కోమటి చెరువుకు చేరుకుంటారు.
⇔ 12.20 నుంచి 1.15 వరకు సిద్దిపేట పట్ట ణంలో హరితహారంలో పాల్గొంటారు.
⇔ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో భోజనం.
⇔ 1.45కు సిద్దిపేట నుంచి బంగ్లావెంకటాపూర్‌కు హెలికాప్టర్ ద్వారా పయనం
⇔ 2 గంటలకు బంగ్లా వెంకటాపూర్‌కు చేరుకుంటారు.
⇔ 2.10కి గ్రామంలోని ఫారెస్ట్ రిజర్వుడ్ నర్సరీ సందర్శన
⇔ 2.50కి బంగ్లా వెంకటాపూర్ నుంచి బేగంపేటకు పయనం.