Siddipet division
-
విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం
-
మోదీ పర్యటనలో సిద్దిపేట మార్క్
సిద్దిపేట నీటిపథకం స్ఫూర్తిగా మిషన్ భగీరథకు రూపకల్పన సాకారం కానున్న సిద్దిపేట రైల్వే మార్గం ఈ రెండింటికీ సిద్దిపేటతో బంధం సిద్దిపేట జోన్: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం నాటి గజ్వేల్ మండలం కోమటిబండ పర్యటనలో సిద్దిపేట మార్క్ కన్పిస్తోంది. జిల్లాకు చెందిన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ మార్గానికి శంకుస్థాపనతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సిద్దిపేటకు దగ్గరి సంబంధం ఉంది. నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించే దిశగా చేపట్టిన గ్రామీణ శాశ్వత మంచి నీటి పథకాన్ని చేపట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేశారు. మరోవైపు గత మూడు దశాబ్దాలుగా సిద్దిపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం రైల్వేలైన్. మార్గానికి మోదీ శంకుస్థాపన చేయడం ద్వారా మరింత మోక్షం లభించనుంది. రైల్వేలైన్ మూడు దశాబ్దాల కల సిద్దిపేట రైల్వేలైన్ ఈ ప్రాంత వాసుల మూడు దశాబ్దాల నాటి కల. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాం నుంచి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకు సిద్దిపేట నియోజకవర్గ ప్రజల్లో బలంగా నాటుకున్న రైల్వేలైన్ ఆశలకు ఆదివారం నాటి ప్రధాని పర్యటనతో కొంత బలం చేకూరిందనే చెప్పాలి. హైదరాబాద్, కరీంనగర్‌లకు అనుసంధానంగా తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి సిద్దిపేట మీదుగా రైల్వేమార్గాన్ని అనుసంధానం చేస్తూ 1999లో కేంద్ర ప్రభుత్వానికి రూ.328 కోట్లతో 151 కిలోమీటర్ల ప్రతిపాదనలతో నూతన మార్గానికి ఓ అడుగు పడింది. ఈ క్రమంలోనే 2005లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి అంకురార్పణ జరిగింది. సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న సిద్దిపేట రైల్వేలైన్ మార్గం భవిష్యత్తులో మరింత వేగవంతంగా ముందుకు సాగి సిద్దిపేట వాసుల మూడు వసంతాల కలకు మార్గం మరింత సుగమమైందనే చెప్పాలి. సిద్దిపేట పథకం రాష్ట్రానికే ఆదర్శం తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్న సిద్దిపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చింది మానేరు మంచినీటి పథకం. ఈ పథకం నుంచే మిషన్ భగీరథకు రూపకల్పన జరిగింది. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి వ్యయప్రయాసాలకోర్చి 58 కిలో మీటర్ల దూరంలోని ఎల్ఎండీ ద్వారా నియోజకవర్గంలోని 144 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేసి పథకానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు సమీపంలోని దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాలకు, సిద్దిపేట మున్సిపల్‌కు నిత్యం మానేరు నీటిని అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సత్ఫలితాలను అందిస్తున్న సిద్దిపేట మానేరు నీటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతిలో నీటిని అందించేందుకు మిషన్ భగీరథకు రూపకల్పన చేశారు. అందులో తొలి ప్రయోగంగా గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథను అమలుకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటకు గర్వకారణం నాడు సిద్దిపేట ముద్దబిడ్డగా కేసీఆర్ ఈ నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన తాగునీటి పథకం నేడు రాష్ట్రానికి మిషన్ భగీరథ రూపంలో ముందుకు రావడం గర్వకారణం. తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి తాగునీటిని అందించే లక్ష్యం ఎంతో గొప్పది. అదే విధంగా సిద్దిపేట వాసుల చిరకాల స్వప్నం రైల్వేలైన్ మార్గానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం శుభసూచకం. రైల్వేమార్గం పనులు వేగవంతానికి ప్రధాని పర్యటన దోహదపడనుంది. ఆదివారం నాటి కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన రెండు మహత్తర కార్యక్రమాలకు చోటు లభించడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అనందం. - హరీశ్‌రావు, రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి -
సిద్దిపేటకు..నరసింహన్
♦ నేడు గవర్నర్ పర్యటన ♦ హరితహారంలో భాగస్వామ్యం ♦ ఇబ్రహీంపూర్ గ్రామస్తులతో ముఖముఖి ♦ నర్సరీలో ప్రజాప్రతినిధులతో భేటీ సిద్దిపేట జోన్ రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తున్నారు. సుమారు 5 గంటల పాటు ఆయన సిద్దిపేట డివిజన్లో అధికారికంగా పర్యటిస్తారు. నియోజకవర్గంలో చేపట్టిన ప్రయోగాత్మక ఆదర్శపథకాలను గవర్నర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకోనున్నారు. అదే విధంగా ఇబ్రహీంపూర్‌ను, పట్టణంలోని పలుప్రాంతాలను గవర్నర్ సందర్శించి మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపూర్లో గ్రామస్తులచే ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, స్వచ్ఛ తెలంగాణ పేరిట చేపట్టిన పారిశుద్ధ్యంతో పాటు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతి రూపంగా నిలిచిన పథకాలపై ఆరా తీయనున్నారు. సుమారు 15 నిమిషాల పాటు గ్రామస్తులచే ముఖముఖిలో గవర్నర్ పాల్గొంటారు. అదే విధంగా నాగుల బండ, బంగ్లావెంకటాపూర్ నర్సరీలను గవర్నర్ సందర్శించి సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధలచే బేటీ అవుతారు. మంత్రి హరీష్‌రావు గురువారం సాయంత్రం గవర్నర్ పర్యటన వివరాలను వెల్లడించారు. గవర్నర్ షెడ్యూల్ ఇలా... ⇔ 9.50కి రాజ్‌భవన్ నుంచి గవర్నర్ పయనం. ⇔ 9.55కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరిక ⇔ 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు హెలిపాడ్ నుంచి ఇబ్రహీంపూర్‌కు పయనం ⇔ 10.30కి ఇబ్రహీంపూర్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ⇔ 10.35 నుంచి 11.45 వరకు ఇబ్రహీంపూర్లో నిర్వహించే హరితహారంలో పాల్గొంటారు. ⇔ 11.55కు ఇబ్రహీంపూర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిద్దిపేటకు పయనం. ⇔ 12.20కి కోమటి చెరువుకు చేరుకుంటారు. ⇔ 12.20 నుంచి 1.15 వరకు సిద్దిపేట పట్ట ణంలో హరితహారంలో పాల్గొంటారు. ⇔ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో భోజనం. ⇔ 1.45కు సిద్దిపేట నుంచి బంగ్లావెంకటాపూర్‌కు హెలికాప్టర్ ద్వారా పయనం ⇔ 2 గంటలకు బంగ్లా వెంకటాపూర్‌కు చేరుకుంటారు. ⇔ 2.10కి గ్రామంలోని ఫారెస్ట్ రిజర్వుడ్ నర్సరీ సందర్శన ⇔ 2.50కి బంగ్లా వెంకటాపూర్ నుంచి బేగంపేటకు పయనం. -
‘వరద కాలువ’ పూర్తయ్యేదెన్నడో?
సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట కోమటిచెరువు నుంచి నర్సాపూర్ ఊర చెరువు వరకు వరద కాలువ నిర్మాణం ఓ పట్టాన పూర్తవడంలేదు. శాశ్వత ప్రాతిపదికన తలపెట్టిన కట్టడానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడంలో ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. పనుల్లో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించడం సిద్దిపేట డివిజన్ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ(ఐఅండ్‌సీఏడీ)కు సవాల్‌గా మారింది. సిద్దిపేటలో ప్రశాంత్‌నగర్.. పట్టణంలోనే విస్తారమైన ఉనికిగలది. కొత్త బస్టాండ్-కోమటిచెరువు మధ్యలోని నిర్దేశిత ఏరియా.. దశాబ్దం కిందట వర్షాలూ.. వరదలతో ముంపునకు గురైంది. భవిష్యత్తులో అలాంటి దుస్థితి ఉత్పన్నం కావొద్దన్న ఉద్దేశంతో వరద కాలువ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని 2007లో నిర్ణయించారు. వాన, వరద నీరు ఆవాసాల చెంతన నిలువకుండానూ చిన్ననీటి వనరులకు తోడ్పాటుగానూ ఉండాలని ఆలోచించారు. దానికి ఉభయతారకమే ఫ్లడ్ ఫ్లో కెనాల్(వరద కాలువ)గా నిశ్చయించారు. ఆ క్రమంలోనే ఐఅండ్‌సీఏడీ రూ.1.23 కోట్లను కేటాయిస్తూ 2007 ఆగస్టు 21న ఉత్తర్వుచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదిరింది. కాలువ మధ్యలో 15 మీటర్ల వెడల్పుతో రెండు వైపుల్లోనూ సిమెంట్ కాంక్రీట్ గోడల్ని 600 మీటర్ల మేర(సున్నా నుంచి 30వ గొలుసు వరకు) కట్టించారు. రెండో విడత గోసగోస ఎంచుకున్న ప్రాజెక్టు తొలి దఫాతో పూర్తవలేదు. అందుకే రెండో దఫాలో మిగతాది (30 నుంచి 76వ గొలుసు దాకా) సంపూర్ణం చేయాలని నిర్ణయించారు. ఈసారి రెండింతలకు పైగానే అంచనా వ్యయంగా లెక్కలేశారు. ఆ ప్రకారం రూ.3.07 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. దానికి ఇరిగేషన్ డిపార్టుమెంటు 2012 మార్చి 6న జీఓ ఇస్తూ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. అదే వరుసలో హైదరాబాద్‌కు చెందిన మరో కాంట్రాక్టు సంస్థ పనులను దక్కించుకొంది. కానీ..ఈసారి నిర్మాణానికి వివాదాలు ముసురుకున్నాయి. పరిహారం కోరుతూ కోర్టుకు... తమ జాగాల్లోంచి కాలువ నిర్మాణాలు చేపట్టరాదని, ఒక వేళ అనివార్యమైతే పరిహారం ఇప్పించాలంటూ పలువురు హైకోర్టుకెళ్లారు. అలా తొమ్మిది కేసులు దాఖలయ్యాయి. సుమారు 70 మంది వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఎక్కడైతే వివాదం లేదో అక్కడ యంత్రాలతో కాలువను తవ్విస్తూ సీసీ(సిమెంట్ కాంక్రీట్) గోడల్ని ఆ డిపార్టుమెంటు కట్టించింది. దీంతో అది కాస్తా ప్యాచ్ వర్కు మాదిరిగా అవతరించింది. అలా 40 శాతం వరకు లాక్కొచ్చారు. పని విలువను బట్టి దాదాపు రూ.1.20 కోట్లు కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు. గత జూన్ నుంచి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వివాదాలు సమసిన వెంటనే... మొన్నటిదాకా వర్షాల కారణంగానూ మరో వైపు కోర్టు కేసుల వల్లనూ వరద కాలువ పనులు ఆగాయి. ప్రస్తు తం నెలకొన్న వివాదాలు సమసిన వెంటనే నిర్మాణాలను తిరిగి ప్రారంభిస్తాం. ఈ పనుల కారణంగా ఎవరికీ పరిహారం ఇచ్చే వెసులుబాటు శాఖాపరంగా లేదు. -కేఎన్ ఆనంద్, ఈఈ, నీటి పారుదల శాఖ, సిద్దిపేట