
హడ్డుబంగి పాఠశాలలో ఏర్పాట్లు చూస్తున్న అధికారులు
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఏర్పాట్లను సోమవారం పరిశీలించింది.
హడ్డుబంగి ఆశ్రమపాఠశాల విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి కార్యక్రమం ఉన్నందున అక్కడకు వెళ్లి హెచ్‌ఎం ఎ.లిల్లీరాణికి సూచనలిచ్చారు. పెదరామ గ్రామంలో ఎస్‌హెచ్‌జీలతో గవర్నర్ మాట్లాడతారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చించారు.
సీహెచ్‌సీతో పాటు, ఐటీడీఏ మీటింగ్ హాల్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నగేష్, ఎంపీడీవో కిరణ్‌కుమార్, డిప్యూటీ ఈవో రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment