ఆరోగ్య శాఖలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ | government green signal to transfers of medical | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శాఖలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

Published Sun, May 7 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

government green signal to transfers of medical

అనంతపురం మెడికల్‌ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీంతో శనివారం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తన చాంబర్‌లో అధికారులతో సమావేశమై చర్చించారు. మూడేళ్ల పాటు ఒకే చోట సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు. ఐదేళ్ల పాటు ఒకే చోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జోనల్, జిల్లా స్థాయి కేడర్లలోని ఉద్యోగాలకు సంబంధించి 20 శాతం మందికి కచ్చితంగా స్థానచలనం కలగనుంది. కాగా అంగ వైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి కొంచెం వెసులుబాటు కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లలో ఉద్యోగుల వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement