government green signal
-
ప్రైవేటు సిమెంటు కంపెనీకి గ్రీన్‌సిగ్నల్
⇒ ఆదిలాబాద్ శివారులో ఏర్పాటుకు అంగీకారం ⇒ లీజుకు 825 ఎకరాల ప్రభుత్వ భూమి ⇒ 36 నెలల్లో పూర్తి చేయాలని జీఓ జారీ ⇒ నిరుద్యోగులకు ఉపాధి ⇒ సీసీఐ తెరుచుకోవడం అనుమానమే ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ సిమెంటు కార్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 825 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు ఇస్తూ 36 నెలల్లో ఏర్పాటు చేయాలని జీవో కూడా జారీ చేసింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు ప్రభుత్వం అంటుండగా.. ఖాయిలా పడ్డ ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐను తెరిపించడంలో పాలకుల వైఫల్యమని, దానిపై ఆధారపడ్డ కార్మికుల పొట్టగొట్టడమేనని సీసీఐ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకారం లభించడంతో ఇక మూతపడ్డ ప్రభుత్వ రంగ సిమెంట్ ఫ్యాక్టరీ సీసీఐ పునరుద్ధరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ సీసీఐ పునరుద్ధరణకు పలుసార్లు కేంద్రమంత్రులను కలిసినప్పటికీ పరిస్థితిలో మార్పు కానరావడం లేదు. దీంతో ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా చర్యలు సాగాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి సీసీఐ పునరుద్ధరణకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఫ్యాక్టరీ తెరవడం అనుమానంగానే ఉంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని యాపల్‌గూడ, రామాయి గ్రామాల్లో ప్రభుత్వ భూమి 825 ఎకరాలను రేణుక సిమెంట్ ప్యాక్టరీకి 50 సంవత్సరాలపాటు లీజుకు ఇచ్చింది. 36 నెలల్లో ఫ్యాక్టరీని ప్రారంభించాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీ ఏర్పాటుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా... ఆదిలాబాద్ మండలం రామాయి, యాపల్‌గూడ గ్రామాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సిమెంట్ ఫ్యాక్టరీలతో ఒప్పందం చేసింది. 1996 నుంచి ఇప్పటి వరకు లీజు అగ్రిమెంట్లు మారుస్తున్నప్పటికీ పనులు ప్రారంభం కావడం లేదు. ఈసారైనా రేణుక ఇండ్రస్టీస్ వారు 36 నెలల్లో పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీ ప్రారంభిస్తారో లేదోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 1996లో జెనీత్ స్టీల్ పైప్ ఇండ్రస్టీస్ వారికి 1572.99 ఎకరాల భూమిని 20 సంవత్సరాలపాటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు లీజు అగ్రిమెంట్ చేసింది. వారు ఫ్యాక్టరీ పనులు చేపట్టకపోవడంతో 1998లో బీర్లా సిమెంట్ ఇండ్రస్టీస్‌కు అగ్రిమెంట్‌ను మార్పుచేసింది. బీర్లా సిమెంట్ 36 నెలల్లో ఫ్యాక్టరీ ప్రారంభం చేయకపోవడంతో వారికి నోటీసులు జారీ చేసి ప్రస్తుతం రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి అగ్రిమెంట్ చేశారు. అయితే 1572 ఎకరాలలో 747 ఎకరాల భూమి నోటీఫైడ్, అసైన్డ్ భూమి కావడంతో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి 825 ఎకరాల భూమిని కేటాయించింది. 36 నెలల్లో ఫ్యాక్టరీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరు ఏడాదికి ఒక కోటి 20 లక్షల టన్నులు సిమెంట్ ఉత్పత్తి చేయనున్నట్లు అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమైతే నిరుద్యోగులకు మేలు జరగనుంది. జిల్లా అభివృద్ధికి ముందడుగు.. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామిక రంగంలో ముందుండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్ చిన్న జిల్లాగా ఏర్పడింది. ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలంటే పరిశమ్రలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. 1978లో జిల్లాకు మంజూరైన సీసీఐ ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో 874 ఎకరాల్లో ప్రభుత్వ భూమితోపాటు 2 వేల ఎకరాలు లీజులో ఉంది. 1982 ఆగస్టు 15న సిమెంట్ ఉత్పత్తి ప్రారంభం కాగా, రూ.60 కోట్లతో స్థాపించారు. ఆ సమయంలో సుమారు 4 వేల మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 3వేల మంది రెగ్యులర్ ఉద్యోగులే. మిగతా వారు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేశారు. కొన్ని ఆటంకాలతో రెండేళ్ల పాటు వాణిజ్యంగా సిమెంట్‌ను ఉపయోగించలేదు. 1984 మేలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నారాయణదత్ తివారీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి 1991 వరకు ఉత్పత్తి చేస్తూ సిమెంట్ సరఫరా అయ్యేది. 1991లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. తద్వారా 1991, 1992, 1993 సంవత్సరాల్లో సీసీఐ వేల కోట్లలో లాభాలు గడించింది. ఇదే సమయంలో ప్రభుత్వం లేవీపద్ధతి(60శాతం ప్రభుత్వం కొనుగోలు చేయడం)ని రద్దు చేయడంతో సీసీఐకి బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయాయి. దీంతో 1993 అక్టోబర్‌లో సీసీఐ ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీంతో వేలాది మంది కూలీలు రోడ్డున పడ్డారు. పరిశ్రమల రంగంలో ఆదిలాబాద్ జిల్లాను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రైవేట్ సిమెంట్ కార్మాగారాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా బాటలు వేస్తోంది. ఫ్యాక్టరీ ఏర్పాటుపై మంత్రి హర్షం ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మండలం యాపల్‌గూడ, రామాయిలో ప్రైవేట్ సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి రామన్న సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో 5 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముందడుగు వేసినట్టవుతుందని హర్షం వ్యక్తం చేశారు. -
ఆరోగ్య శాఖలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీంతో శనివారం డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తన చాంబర్లో అధికారులతో సమావేశమై చర్చించారు. మూడేళ్ల పాటు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు. ఐదేళ్ల పాటు ఒకే చోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జోనల్, జిల్లా స్థాయి కేడర్లలోని ఉద్యోగాలకు సంబంధించి 20 శాతం మందికి కచ్చితంగా స్థానచలనం కలగనుంది. కాగా అంగ వైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి కొంచెం వెసులుబాటు కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లలో ఉద్యోగుల వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. -
‘సహాయం’కుగ్రీన్ సిగ్నల్
గ్రానైట్ అక్రమ దందాపై సమగ్ర విచారణకు ఐఏఎస్ అధికారి సహాయం కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణను మదురై జిల్లాకు మాత్రమే పరిమితం చేసినట్లు సంకేతాలు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ రామస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసుకు పట్టుబడుతూ పిటిషన్ దాఖలు చేశారు. సాక్షి, చెన్నై:రాష్ట్రంలో గ్రానైట్, సముద్ర తీరాల్లో ఖనిజ సంపదల్ని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న బడా బాబుల బండారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కేవలం మదురైలోనే వేల కోట్ల కుంభకోణం బయటపడడంపై మద్రాసు హైకోర్టు రాష్ర్ట వ్యాప్తంగా సమగ్ర విచారణకు ఆదేశించింది. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలో కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయలేదు. ఇప్పటికే తాము అన్ని చర్యలు తీసుకున్నామంటూ ఆ కమిటీని వ్యతిరేకించే పనిలో పడింది. ఎట్టకేలకు గత వారం హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో కమిటీ ఏర్పాటు అనివార్యం అయింది. ఆమోదం : నాలుగు రోజుల్లోపు కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ గత వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆ గ డువు ముగిసినా ఉత్తర్వులు వెలువడ లేదు. దీంతో కోర్టు ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సహాయం కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని గురువారం ప్రధాన బెంచ్ ముందు ఉంచారు. సహాయం కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు, ఆ కమిటీకి ప్రభుత్వం అందించే సహాయాన్ని వివరిస్తూ తన వాదనను బెంచ్ ముందు ప్రభుత్వం తరపు న్యాయవాది సోమయాజులు ఉంచారు. మదురైకు పరిమితం: సహాయం కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ర్ట ప్రభుత్వం తన పనితనాన్ని ప్రదర్శిస్తూ మెలిక విధించడం చర్చనీయాంశమైంది. కేవలం మదురైలో సాగిన గ్రానైట్ స్కాంపై సమగ్ర విచారణ జరిపే విధంగా ఆ కమిటీకి అధికారాల్ని ప్రభుత్వం ఇచ్చినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వాదనల సందర్భంగా ట్రాఫిక్ రామస్వామి తరపు న్యాయవాది రాజారాం బెంచ్ ముందుకు కొన్ని విషయాల్ని తీసుకెళ్లారు. కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చిన దృష్ట్యా, అందులో ఉన్న అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తదుపరి పిటిషన్‌కు బెంచ్ అవకాశం కల్పించింది. దీంతో కోర్టు ధిక్కార కేసు నమోదు లక్ష్యంగా ట్రాఫిక్ రామస్వామి బెంచ్‌ముందు పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోకుండా, కేవలం మదురైకు పరిమితం చేస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే, కాలయాపన, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎంకే నేత రాందాసు తన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని వ్యతిరేకించారు. కోరల్ని పీకేసి కమిటీని ఏర్పాటు చేసినట్టుందని మండి పడ్డారు. కేవలం మదురైకు పరిమితం చేయకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సహాయం నేతృత్వంలోని కమిటీకి విచారణ జరిపే అధికారాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. -
‘వోల్వ్స్’కు వీసా చిక్కులు
చండీగఢ్: పాకిస్థాన్ జట్టు ఫైసలాబాద్ వోల్వ్స్‌ను వీసా చిక్కులు వెంటాడుతున్నాయి. దీంతో ఈ జట్టు సభ్యులను ఉన్నపలంగా చండీగఢ్ నుంచి మొహాలీకి తరలించారు. కారణం భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ వారికింగా పూర్తి స్థాయి వీసా దక్కలేదు. కేవలం మొహాలీకి మాత్రమే పరిమితమయ్యే విధంగా కేంద్రం వీసా మంజూరు చేసింది. మంగళవారం నుంచి మొదలయ్యే చాంపియన్స్ లీగ్ క్వాలిఫయింగ్ ఈవెంట్ కోసం మిస్బావుల్ హక్ నేతృత్వంలోని వోల్వ్స్ జట్టు శనివారం ఇక్కడికి చేరుకుంది. కానీ చండీగఢ్‌కు ఈ వీసా చెల్లుబాటు కాకపోవడంతో ఆటగాళ్లను బస చేసిన హోటల్ నుంచి మొహాలీలోని పీసీఏ స్టేడియం క్లబ్‌హౌస్‌కు తరలించారు. దీనిపై బీసీసీఐ... విదేశీ వ్యవహారాల శాఖ, హోం శాఖ వర్గాలతో చర్చిస్తోంది. సోమవారం కల్లా వీసా సమస్య తీరుతుందని, తిరిగి చండీగఢ్ హోటల్‌కు వోల్వ్స్‌ను తరలించే అవకాశముందని బోర్డు తెలిపింది. నిజానికి భారత ప్రభుత్వం తొలుత పాక్ జట్టుకు వీసా నిరాకరించింది. ఎట్టకేలకు చివరి నిమిషంలో మంజూరు చేయడంతో భారత్‌కు వచ్చింది.