రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Published Mon, Sep 26 2016 10:21 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
భూదాన్‌పోచంపల్లి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జీబీఆర్ గార్డెన్స్‌లో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా గోల్డ్ లోన్ కౌంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పీఏసీఎస్ ప్రహరీరిగోడ నిర్మాణ ంతోపాటు జిబ్లక్‌పల్లి గోదాం, ముక్తాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మూసీ ఆధునికీకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పీఏసీఎస్ చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి మాట్లాడుతూ రూ.కోటి యాభై లక్షల లాభాలను ఆర్జించి సంఘం ముందుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లాలోనే మొదటిస్థానంలో ఉన్నామని, నాణ్యమైన సేవలతో జిల్లా ఉత్తమ అవార్డును అందుకొన్నామని పేర్కొన్నారు. పీఏసీఎస్ చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్ ఎంపీపీ సు«ధాకర్‌రెడ్డి, ఏఓ ఏజాజ్ అలీఖాన్, వైఎస్ చైర్మన్ సుర్వి రాములు, డైరక్టర్లు కె.బాల్‌రెడ్డి, పెద్దల సత్తమ్మ, ఎస్.రంగయ్య, బస్వయ్య, కందాడి భూపాల్‌రెడ్డి, వారాల యాదిరెడ్డి, చుక్క యాదయ్య, సుధాకర్‌రెడ్డి, గుర్రం మణెమ్మ, గుర్రం లక్ష్మారెడ్డి, పగిల్ల సుధాకర్‌రెడ్డి, సీఈఓ సద్దుపల్లి బాల్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement