హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం | green telangana govt aim | Sakshi
Sakshi News home page

హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

Published Sun, Jul 17 2016 5:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

మొక్కలు పంపిణీ చేస్తున్న సత్యనారాయణ

మొక్కలు పంపిణీ చేస్తున్న సత్యనారాయణ

  • ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ
  • ౖయెటింక్లయిన్‌కాలనీ : రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్‌ 38వ డివిజన్‌లోని వీర్లపల్లి గ్రామంలో ఆదివారం 1200 మొక్కలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అడవులు పెరగాలని, వర్షాలు కురవాలని అన్నారు. దీనికోసం ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత తీసుకోవాలని కోరారు. వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు మొక్కల పెంపకం ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రతీఒక్కరు పాల్గొనాలని సూచించారు.
    ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేలా ప్రభుత్వం ప్రత్యేక  చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీర్లపల్లి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో ఖాళీ ప్రదేశాలు కనిపించకుండా మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన వారికి ఉచితంగా పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు, 38వ డివిజన్‌ కార్పొరేటర్‌ నారదాసు మారుతి, కుంట సాయి, నాయకులు దీటి బాలరాజు. ఉల్లెంగుల రమేశ్, వేణుగోపాల్‌రావు, శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, పారిజాతం, రజిత తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement