గుంతకల్లు డివిజన్‌ జోన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలి | guntakal division zone upgrade : ap bc sangham demand | Sakshi
Sakshi News home page

గుంతకల్లు డివిజన్‌ జోన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలి

Published Wed, Nov 9 2016 10:57 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

guntakal division zone upgrade : ap bc sangham demand

– ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌
గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్‌ను రైల్వేజోన్‌గా అప్‌గ్రేడ్‌ చేయడానికి అన్ని విధాల అర్హతలున్నాయని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన తన  కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దక్షిణ భారతదేశానికే గుంతకల్లు సెంటర్‌ పాయింట్‌ అన్నారు.

గుంతకల్లులో రైల్వే డీజిల్, ఎలక్ట్రికల్‌ ట్రాక్షన్‌ షెడ్, ట్రైనింగ్‌ సెంటర్లు తదితరాలున్నాయన్నారు. రైల్వేజోన్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలం కూడా ఉందన్నారు. ఇప్పటికే రాయలసీమ బాగా వెనుకబడిన ప్రాంతమని, బలహీన వర్గాల పేదలు, నిరుద్యోగులు, స్కిల్డ్‌ లేబర్‌కు ఈ రైల్వే ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడీ కామాచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement