
ఇండ్లు బాగున్నయ్ కానీ..
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం విస్తృతంగా పర్యటించారు. గజ్వేల్ లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎర్రవల్లిలో రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు. ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టిన మీనాక్షి గ్రూపు ప్రతినిధి బాపినీడుతో మంత్రి సరదాగా మాట్లాడారు. ‘ఇండ్లు బాగున్నయ్.. పైసలు మిగలవ్ కానీ పేరు మాత్రం మిగులుతుంది’ అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ‘సిద్దిపేటలోనూ మీరే కట్టాలి. ఎర్రవల్లిలో ఇళ్లు చూసిన వాళ్లంతా మాకెప్పుడు కట్టిస్తారని అడుగుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన కొండపాక, దుబ్బాక, సిద్దిపేటలోనూ పర్యటించారు.
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ ఒక్క ఆడుగు ముందుకేసి తెలంగాణ తెచ్చిండు..ఆదే ఆడుగుతో ఎర్రవల్లి నుంచి బంగారు తెలంగాణకు బాటలు వేసిండు.. మహా ఒప్పందంతో తెలంగాణ సస్యశ్యామలానికి శ్రీకారం చుట్టారు.. సీఎం సంకల్పంతో తెలంగాణ స్వర్ణయుగం కాబోతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఉదయం 9 గంటలకు గ్రామానికి చేరుకున్న ఆయన చెరువు, కుంటలను, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. కాలినడక వెళ్తూ డబుల్ బెడ్రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. నమూనా కోసం నిర్మించిన ఇల్లు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లిని చూస్తుంటే బంగారు తెలంగాణ కనిపిస్తోందని, ఎర్రవల్లి గ్రామస్తులంతా అదృష్టంతులన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎర్రవల్లి నంబర్‌వన్ మోడల్ గ్రామంగా తయారవుతుందన్నారు.
నెల ముందే గజ్వేల్‌కు గోదావరి...
సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు గజ్వేల్ ప్రాంతానికి నెల రోజుల ముందే గోదావరి నీళ్లు వచ్చాయని, కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జేసీ వెంకట్రాంరెడ్డి తదితర అధికారులు నీళ్ల కోసం నిరంతరం కృషి చేశారని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. మిషన్‌భగీరథ పథకంలో భాగంగా ఏప్రిల్‌లో గజ్వేల్‌కు నీళ్ల వస్తాయని అనుకుంటే సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రెండు రోజుల క్రితమే గజ్వేల్‌కు గోదావరి నీళ్లొచ్చాయన్నారు.
కుంటల అభివృద్ధికి రూ.13 కోట్లు
ఎర్రవల్లిలో చెరువు, కుంటలకు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు రూ.13.90 కోట్లను మంజూరు చేశారు. ఎర్రవల్లిలో నాలుగు కుంటలకు 5.80 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఈ పనులను పరిశీలించిన మంత్రి అదనంగా మరో రూ. 5 కోట్లను మంజూరు చేశారు. అలాగే పాండురంగ రిజర్వాయర్ అభివృద్ధికి 8.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధుల మంజూరుతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ హరీష్‌రావును సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డిలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జేసీ వెంకట్రాంరెడ్డి, గఢా అధికారి హన్మంతరావు, ఇరిగేషన్ స్పేషల్ అధికారి మల్లయ్య, డీఈ శ్రీనివాస్‌రావు, తహశీల్దార్ అనిల్, ఎంపీడీఓ రామారావు, సర్పంచ్‌భాగ్య, బాల్‌రెడ్డి, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నర్సింహ్మరెడ్డి, రంగారెడ్డి, మండల సర్పంచ్‌లు కరుణకర్, సుధాకర్‌రెడ్డి, వీడీసీ సభ్యులు బాల్‌రాజు, సత్తయ్య, కృష్ణ ఉన్నారు.
వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
సిద్దిపేట జోన్ : ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గం దేశ, రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచిందని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆమలులో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపిడీఓలు వివిధ శాఖల అధికారులచే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకు వివిధ పథకాల కింద ఆర్ధిక సహయం అందించేందుకు వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అదేశించారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి ఆర్ధిక సహయం అందించేందకు చొరువ చూపలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఆర్హత కుటుంబానికి నెల చివరిలోగా గ్యాస్ సిలిండర్‌లను పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలని తహశీల్దార్‌లకు అదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియలో ఆర్‌డబ్ల్యూఎస్, ఆటవీ శాఖ అధికారులు సహకరించాలని సూచించారు.
ఉపాధి హమీ కింది కూలీకి 150 పని దినాలు కల్పించాలని అ దిశగా ఉపాధి హమీ కూలీలను అదుకొవాలన్నారు. అదే విధంగా ఇంకుడు గుంతల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ నెల చివరిలోగా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా మండల అధికారులు చర్యలు తీసుకొవాలన్నారు. ప్రజాప్రతినిదులు గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యం చేయాలని ఇంకుడు గుంతల ఆవశ్యకతను వివరించాలన్నారు. అభయహస్తం, వివిధ స్కాలర్‌షిప్‌లను చెల్లింపు త్వరితగతిన పూర్తి చేయలన్నారు. వడ్డీలేని రుణాల కింద 140 కోట్లను కేటాయించడం జరిగిందని పంపిణీ వేగవంతం చేయలన్నారు. అంతకుముందు పంచాయితీ రాజ్‌శాఖ పనితీరును మంత్రి సమీక్షిస్తు అంగన్‌వాడీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను, ఎంపీపీ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు నిధులు వెనక్కి పొకుండా చూడాలని అధికారులను అదేశించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు సొలిపేట రామలింగారెడ్డి, హనుమంతుషిండే, జేసీ వెంకట్‌రాంరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.