
వడగాలిలో సుడిగాలిలా..
♦ మండుటెండలో మంత్రి హరీశ్ పర్యటన
♦ 12 గంటలకుపైగా వరుస కార్యక్రమాలు
♦ జహీరాబాద్ మొత్తాన్ని చుట్టేసిన మంత్రి
♦ రూ.100 కోట్ల మేర పనులకు మంజూరు
♦ మంత్రి హరీశ్‌తో ‘సాక్షి’ ఒకరోజు...
ఓవైపు భానుడు నిప్పులు చెరుగుతున్నాడు... మరోవైపు జనం ఎండ వేడిమికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అవేమి లెక్కచేయని మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయం నుంచి రాత్రివరకు నియోజకవర్గ పర్యటన చేపట్టారు. ఓవైపు 43.4 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైనా పర్యటనను ఏ మాత్రం కుదించుకోలేదు. దశాబ్ద కాలంలో ఇంతటి భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి. అదీగాక ఆరు దశాబ్దాల కాలంలో జహీరాబాద్ నియోజకవర్గానికి ఒకేరోజు రూ.100 కోట్ల మేర అభివృద్ధి పనులు మంజూరు కావడం మరో రికార్డు. మండు టెండలోనూ పల్లెపల్లెను పలకరించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రి సుడిగాలి పర్యటనను బుధవారం ఉదయం 5 నుంచి రాత్రి వరకు ‘సాక్షి’ బృందం అనుసరించింది. మంత్రి హరీశ్‌రావుతో ‘సాక్షి’ ఒక రోజు ఇలా..
- సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
♦ మంత్రి హరీశ్‌రావు మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి హై దరాబాద్ చేరుకున్నారు. ఉదయం 5కే నిద్ర లేచారు. దినపత్రికలు తిరగేస్తూనే దినచర్యను మొదలు పెట్టారు.
♦ ఉదయం 6: టేబుల్ మీదకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి నిల్వలు, విని యోగం, కరెంటు ఉత్పత్తి డిమాండ్ తదితర లెక్కలతో కూడిన నివేదిక ఉంది. వాటిపై అధికారులకు సూచనలు, ఆదేశాలిచ్చారు.
♦ ఉదయం 7: టిఫిన్ చేసి తన చాంబర్‌లోకి వచ్చారు. అప్పటికే వందమందికిపైగా ఆ యన కోసం వచ్చి వేచి ఉన్నారు. వారు ఇచ్చి న అర్జీలు స్వీకరించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి బయలుదేరుదామనుకునే లోపే పక్క జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి వారి సమస్యలు చెప్పారు. ఈలోగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వచ్చారు. అంతలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వచ్చారు. తన జిల్లా సమస్యలను దృష్టికి తెచ్చారు.
♦ ఉ.8.45: హైదరాబాద్ నుంచి ప్రయాణం..
♦ ఉ. 9.50: ఝరాసంగం మండలం జీర్లపల్లి చేరుకున్నారు. ఊరు ఊరంతా జోరుమీదుం ది.
డప్పుల దరువు... మంగళ వాయిద్యాలతో పిల్లాజెల్లా ఊరుబయటకొచ్చారు. ఆ త్మీయ అతిథికి వీర తిలకందిద్ది ఆహ్వానిం చారు. ఓ మాజీ మంత్రి సారథ్యం వహిస్తు న్న జహీరాబాద్ నియోజకవర్గంలోని ఈ పల్లెలకు స్వాతంత్య్రం వచ్చిన 67 ఏళ్ల తరువాత మొట్ట మొదటి సారి ఊరులోకి అడుగుపెట్టిన మంత్రి ఒక్క హరీశ్‌రానేనట. గ్రామస్థుల ఆనందానికి అదే కారణం. హరీశ్‌రావు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రాయి వేశారు. పాఠశాల భవనాన్ని ప్రారంభించా రు. మైకందుకున్న మంత్రి పల్లెపై వరాల జల్లు కురిపించారు. బీటీ రోడ్డు, చెరువు పూ డికతీత, కమ్యూనిటీ భవనం, సీసీ రోడ్లు ఇలా మొత్తం రూ.3.5 కోట్ల విలువైన పనులకు హామీలు ఇచ్చారు. అక్కడి నుంచి అదే మండలం ఏడాకులపల్లి చేరుకున్నారు. ఈ గ్రామానికో చరిత్ర ఉంది.
కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు అండగా నిలబడి తొలిసారిగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని సర్పంచుగా గెలిపించిన గ్రామం ఇది. కోరుకున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక, అధికార పార్టీ మంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్టిన హరీశ్‌రావు కురిపించిన వరాల జడివానలో పల్లెజనం తడిసి ముద్దయింది. ఈ ఎం డాకాలంలో తాగునీటి ఉపశమనం కోసం రూ.2 లక్షలు, వచ్చే ఏడాది శాశ్వత మంచి నీటి పరిష్కారానికి ఈ గ్రామానికి రూ.50 లక్షలు మంజారు చేశారు. రెండోవిడత మిషన్ కాకతీయ కింద చెరువు పునరుద్ధర ణ, బస్ షెల్టర్, రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, ధాన్యం నిల్వకు వీలుగా గోదాం నిర్మాణానికి హామీ ఇచ్చారు.
♦ ఏడాకులపల్లి సభ ముగిసే సమయానికి సూర్యప్రతాపం మొదలైంది. దీనికి వడగాలి పోటు క్రమంగా తోడైంది.
♦ ఉ.11.40: కవేలి-కోహీర్ మధ్య నారింజ వా గు మీద కట్టిన బ్రిడ్జి-కం-రోడ్డును ప్రారంభించారు. రూ.4.10 కోట్లతో నిర్మించిన ఈ వంతెన వర్షాకాలంలో కోహీర్ ప్రజలు రాకపోకలకు ఎంతో ఉపయోగపడుతుంది.
♦ అక్కడి నుంచి కోహీర్ చేరుకున్నారు. అక్కడ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించా రు. బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నీళ్లు లేక దుబ్బతేలిన పంట భూములను వాహనంలో నుంచి వెళ్తూనే పరిశీలించారు. ‘మన దగ్గర పుట్టి, మన పొ లాల్లో పారి కర్ణాటక వెళ్లిపోతున్న నారింజ వాగు నీళ్లను ఒక్కొక్క చుక్కా ఒడిసి పట్టుకోవటమే కోహీర్ కరువుకు పరిష్కారం. నారిం జ వాగును పునరుద్ధరణకు ఎంతైనా ఫర్వాలేదు. బాగుచేసుకోండయ్యా’ అని పక్కనే ఉన్న స్థానిక నాయకులకు సూచించారు.
♦ అప్పటికే ఎండ నడి నెత్తికొచ్చింది. గాలిలో తేమ దాదాపు 39 శాతం తగ్గిపోయి ఉక్కపో స్తోంది. భోజనం చేసి చల్లబడేందుకు విశ్రాం తి తీసుకొని సాయంత్రం మళ్లీ పర్యటన పునఃప్రారంభిద్దామని నాయకులు చేసిన సూచనకు ఆయన నవ్వి ఊరుకున్నారు.
♦ జహీరాబాద్ పట్టణ సమీపంలో ఓ సొసైటీ వెంచర్‌కు భూమి పూజ చేశారు.
♦ మధ్యాహ్నం 2.09 గంటలకు ఓ ప్రైవేటు కంపెనీలో భోజనానికి ఉపక్రమించారు.
♦ మ. 2.18: చేయి కడిగి మళ్లీ కారెక్కారు. అతి థి గృహంలో కొంతమందికి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చనిపోయిన ముగ్గురు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు రూ. 2లక్షల చొప్పున పార్టీ బీమా చెక్కులు అం దించారు. ఇక్కడే హైదరాబాద్ నుంచి వచ్చిన ఫైళ్లపై సంతకం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చిన బాధితుల దరఖాస్తుల మీద సంతకాలు చేశారు. కొద్దిసేపు స్థానిక విలేకరులతో మాట్లాడారు.
♦ అర గంటలో పనులన్నీ పూర్తి చేసుకున్న మంత్రి మధ్యాహ్నం 2.55కిప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. నేరుగా మెట ర్నిటీ వార్డుకు చేరుకున్నారు. ధర్మారం గ్రా మానికి చెందిన బాలింత నాగ సంగీతం దగ్గరకు వెళ్లి అమ్మా... ‘పాప? బాబా? అని పల కరించారు. వైద్యం సరిగా అందుతుందా?, ఎవరైన డబ్బులు అడుగుతున్నారా?, ఆరోగ్యం ఎలా ఉంది?, తోడుగా ఎవరొచ్చారు?’ అంటూ ఆరా తీశారు. గతంలో మంత్రి హరీ శ్‌రావు రూ.7 కోట్లతో ఆసుపత్రి ఆధునికీకరణకు అనుమతించారు. 60 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఆటో ఎనలైసిస్ మిషన్, ఎక్స్‌రే పరికరాలు, మేజర్ ఆపరేషన్ పరికరాల కోసం ఈ నిధులిచ్చారు. ఈ నిధు లు రావడం, పరికరాలు కొని వినియోగంలోకి తేవడం చకచకా జరిగిపోయాయి. వీటి ని ప్రారంభించాలని ఆసుపత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ శ్రీనివాస్ మంత్రిని కోరారు. పరికరాలు ఇంత తొందరగా వచ్చాయా? అంటూ మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
♦ జహీరాబాద్ మండలం రంజోల్ మీదుగా న్యాల్‌కల్ చేరుకున్నారు. సూర్యాస్తమ సమయానికి మంత్రి హరీశ్‌రావు డప్పూరు చెరువుకు చేరుకుని మిషన్‌కాకతీయ పనులు ప్రా రంభించారు. గడ్డపారతో చెరువు మట్టి తవ్వారు. తట్టలో రేగడి మట్టి నింపి ఎత్తిపోశారు. అక్కడి నుంచి రాఘవాపురం-హుమ్నాబాద్ గ్రామాల మధ్య ఉన్న పంచవటి క్షేత్రంలో కాశీనాథ్ బాబా నిర్వహిస్తోన్న పుష్కర కాల రుద్రయాగంలో పాల్గొన్నారు.
♦ అక్కడి నుంచి సాయంత్రం 7కి నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన వెంట డిప్యూ టీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు.
♦ రాత్రి 10.30: కొండాపూర్‌లోని హనుమాన్‌స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
♦ రాత్రి 11.00: నారాయణఖేడ్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు.