అగళి మండలంలో మంగళవారం 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
అనంతపురం అగ్రికల్చర్ : అగళి మండలంలో మంగళవారం 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 10.4 డిగ్రీలు, మడకశిర 10.7 డిగ్రీలు, రొద్దం 10.7 డిగ్రీలు, సోమందేపల్లి 11.7 డిగ్రీలు, అమరాపురం 11.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుంచి 17 డిగ్రీల వరకు కొనసాగాయి.
పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 30 నుంచి 33 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 77 నుంచి 87, మధ్యాహ్నం 20 నుంచి 30 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితీవ్రత కొనసాగుతోంది.