heavy cold
-
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న టెంపరేచర్
-
73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య
సుజు: నూతన సంవత్సరం రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్లో సోమవారం రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచి్చన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 73కు పెరిగింది. భారీ వర్షాలు, చంపేసే చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంక ఏర్పడుతోందని, అయినాసరే సహాయక చర్యల్ని ముమ్మురం చేసినట్లు ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం చెప్పారు. సగం కూలిన భవనాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనావేశారు. రాత్రంతా కేవలం నాలుగు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండటంతో చలిలో శిథిలాల వద్ద అన్వేషణ, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడిన 300 మందిని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి
-
ఉమ్మడి వరంగల్ జిల్లాపై చలి పంజా
-
తీవ్రమైన చలితో చిత్తూరు జవాను మృతి
చంద్రగిరి : జమ్మూ–కశ్మీర్ ఆర్మీలో జవానుగా సేవలందిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు (38) చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన మంచు రెడ్డప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డప్పనాయుడు గత 14 సంవత్సరాలుగా మిలటరీలో జవానుగా పనిచేస్తున్నాడు. శనివారం జమ్మూ–కశ్మీర్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో రెడ్డప్పనాయుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. సహచరులు ఆయనకు ప్రథమ చికిత్సను అందించారు. ఆయన పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలీకాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడని, ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రెడ్డప్పనాయుడుకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాతి్వక్, కుమార్తె నిశిత ఉన్నారు. 14 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించినందుకు రెడ్డప్పనాయుడుకు ఇటీవల పదోన్నతి లభించడంతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబానికి ఇంతటి చేదు వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం మృతదేహం గడ్డకిందపల్లికి చేరుకోనుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్డేట్.. ‘మంచు’లా కరిగిపోయాడు ఇరవై ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు. ఆయన చేసిన సేవలకు హవల్దార్‌గా పదోన్నతి లభించింది. మరో మూడేళ్లలో ఆయన సర్వీసు పూర్తి కానుంది. జనవరి 1న ఇంటికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. సంక్రాంతికి వస్తానని భార్య రెడ్డమ్మకు తెలిపారు. ఇంతలోనే శనివారం జమ్మూ–కశ్మీర్లో విధినిర్వహణలో చలి తీవ్రతకు నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో భరతమాత ఒడిలో అశువులు బాశాడు ఆ వీరుడు. ఆ వీర సైనికుడే గడ్డకిందపల్లెకు చెందిన మంచురెడ్డెప్పనాయుడు. దేశ సేవలో ప్రాణాలర్పించడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు ఉద్వేగంగా తెలిపారు. చంద్రగిరి: జమ్ము–కశ్మీరులో సైనికుడిగా దేశ సేవ చేస్తున్న గడ్డకిందపల్లెకు చెందిన రెడ్డెప్పనాయుడు(38) విధి నిర్వహణలో మృతి చెందాడన్న వార్త జిల్లా వాసులను కలచి వేసింది. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ గడ్డకిందçపల్లె్ల గ్రామానికి చెందిన మంచు రెడ్డెప్పనాయుడు, శాంతమ్మ దంపతుల కుమారుడు రెడ్డెప్పనాయుడు. రెడ్డెప్పనాయుడు పెద్ద కుమారుడు కాగా, పురుషోత్తమ నాయుడు రెండో కుమారుడు. రెడ్డెప్పనాయుడు చిన్నప్పటి నుంచి దేశసేవ చేయాలని పరితపించేవాడు. ఇంటర్ తర్వా త ఆర్మీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఆపై 2000 సంవత్సరంలో ఆర్మీకి ఎంపికై దేశ సేవ చేస్తున్నాడు. 20 ఏళ్ల సర్వీసులో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన సేవలను అందించారు. ప్రస్తుతం జమ్ము–కశ్మీర్లో విధుల్లో ఉన్నారు. జనవరి 1వ తేదీన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భార్య రెడ్డమ్మతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పాడు. కుటుంబమంతా పండుగ చేసుకుని, నూతనంగా నిర్మించిన కొత్త ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుందామని తెలిపారు. శనివారం జమ్ము–కశ్మీర్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో విధి నిర్వహణలో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సహచరులు ప్రథ మ చికిత్సను అందించారు. పరిస్థితి మరింత క్షీణించడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో రెడ్డెప్పనాయుడు మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ వార్తను అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. పిల్లలు రోదించడం గ్రామస్తులను కలిచివేసింది. మంగళవారం ఉదయం మంచురెడ్డప్పనాయు డు మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరవై ఏళ్లుగా దేశ సేవ 20 సంవత్సరాలుగా నా బిడ్డ దేశానికి సేవ చేస్తున్నాడు. దేశ సేవలో అసువులు బా యడం గర్వంగా ఉంది. మీ కుమారుడు కన్నుమూశారని ఆర్మీ అధికారులు మాకు సమాచారం అందించారు. మంగళవారం భౌతికకాయాన్ని అప్పగిస్తామని చెప్పారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేకపోతున్నాం. – మంచు రెడ్డెప్పనాయుడు, తండ్రి దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది దేశం కోసం నా భర్త చనిపోవడం గర్వంగా ఉంది. కానీ ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. లాక్‌డౌన్‌కు ముందు ఇక్కడకు వచ్చారు. కొత్త ఇంటిని నిర్మించుకున్నాం. అనంతరం హెడ్‌క్వార్టర్స్ నుంచి పిలుపు రావడంతో విధులకు వెళ్లారు. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త ఇంట్లో చేరి సత్యనారాయణ వ్రతం చేద్దామని ఆయన చెప్పారు. ఇంతలోనే అసువులు బాసారని తెలియడం మనోవేదనకు గురి చేస్తోంది. – మంచు రెడ్డెమ్మ, భార్య -
అగళిలో 9.5 డిగ్రీలు కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : అగళి మండలంలో మంగళవారం 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 10.4 డిగ్రీలు, మడకశిర 10.7 డిగ్రీలు, రొద్దం 10.7 డిగ్రీలు, సోమందేపల్లి 11.7 డిగ్రీలు, అమరాపురం 11.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుంచి 17 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 30 నుంచి 33 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 77 నుంచి 87, మధ్యాహ్నం 20 నుంచి 30 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితీవ్రత కొనసాగుతోంది. -
కొనసాగుతోన్న చలి తీవ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా చలి గజగజ వణికిస్తోంది. చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం కూడా అగళి మండలంలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మడకశిర 10.6 డిగ్రీలు, రొద్దం, తనకల్లు 11.2 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 13 నుంచి 16 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 32 డిగ్రీలు నమోదైంది. గాలిలో తేమ ఉదయం 78 నుంచి 92, మధ్యాహ్నం 26 నుంచి 36 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
బాబోయ్... చలి!
– వణుకుతున్న 'అనంత' - అగళిలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు – తగ్గిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు – అర్ధరాత్రి నుంచే కమ్ముకుంటుంన్న పొగమంచు – జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు అనంతపురం మెడికల్ : పల్లె..పట్టణం అన్న తేడా లేకుండా చలిపులికి ‘అనంత’ వణుకుతోంది. చలిగాలులతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి 8 గంటల నుంచే పొగ మంచు కమ్ముకుంటుంటోంది. ఆదివారం కూడా అగళిలో కేవలం 6.9 డిగ్రీలుగా నమోదైంది. మడకశిర 7.6 డిగ్రీలు, కుందుర్పి 9.5 డిగ్రీలు, గుమ్మగట్ట 9.6 డిగ్రీలు, అమరాపురం 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, బాలింతలు, వృద్ధులు,. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలోనూ చలి వాతావరణం అనారోగ్యాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. చంటిబిడ్డలకు రక్షణ ఇలా..! – చిన్న పిల్లలకు ఉదయం 11 గంటల తర్వాత స్నానం చేయించాలి. చల్లని వాతావరణంలో వేడి నీళ్ల స్నానం చేయించినా బిడ్డను ఇంట్లోకి తీసుకెళ్లేలోపు శరీర ఉష్ణోగత్ర తగ్గిపోతుంది. – తలకు నూనె, కళ్లకు కాటుక, ఉగ్గుపాలు వంటివి వినియోగించుకూడదు. – జలుబు చేస్తే నాజిట్ డ్రాప్స్ మాత్రమే వినియోగించాలి. సిట్రజిన్ సిరప్ వాడొచ్చు. దోమ తెరలను తప్పనిసరిగా వాడాలి. – చిన్న బిడ్డలు ఉన్న చోట పొగ తాగకూడదు. – తలస్నానం చేయించాక సాంబ్రాణి పొగ వేయకూడదు. అలా చేయడం వల్ల శ్వాసకోస వ్యాధులు సంక్రమిస్తాయి. – పుట్టిన బిడ్డలకు బొడ్డు ఊడలేదనే అపోహతో రుద్దడం చేయకూడదు. అక్కడ తడి ఉంటే పొడిగుడ్డతో అద్దడం మాత్రమే చేయాలి. – డైపర్స్ వాడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. లేదంటే బ్యాక్టీరియా వ్యాపించి శరీరంపై దద్దుర్లు వస్తాయి. – గర్భిణులు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మూడు నెలల లోపల ఏ విధమైన మాత్రలు వినియోగించకూడదు. అర కిలో మీటర్ వరకు నడవచ్చు. జలుబు, దగ్గు వస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. 'పెద్ద'లను కాపాడుకుందామిలా..! – 60 ఏళ్ల పైబడిన వృద్ధులు చలి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 5 గంటల నుంచి ఆరు గంటల మధ్య నడకకు వెళ్లడాన్ని మానుకోవాలి. ఆరు గంటల నుంచి 7 గంటల మధ్య మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు మంకీ క్యాప్, ఉన్ని వస్త్రాన్ని చెవులు, ముక్కుతో పాటు తలకు చుట్టుకోవడం మంచిది. ముక్కులకు మంచు గాలి తగలకుండా జాగ్రత్త పడాలి. ఫుల్ హ్యాండ్ దుస్తులు, చేతికి గ్లౌజులు వాడాలి. – గృహిణులు మంచు సమయంలో ఇంటి కిటికీలను మూసివేయాలి. – కూల్‌డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది. పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం. – గోరు వెచ్చని నీరు, తేనె, నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. – గ్రీన్ టీ మేలు చేస్తుంది. రోజుకు మూడు, నాలుగు సార్లు తాగొచ్చు – గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం, నెమ్ము లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఉదయం 8 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. – ఏసీలు వినియోగించే వారు చలి తీవ్రత తగ్గే వరకు నిలిపివేయడం మంచిది తల్లి పొత్తిళ్లే 'పురిటి బిడ్డ'కు మేలు : పురుటి బిడ్డల (28 రోజుల వయసున్న వారు) విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రసవమైన వెంటనే నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలైతే చలి తగలకుండా చూసుకోవాలి. వెచ్చదనాన్ని కలిగించే ఇంక్యుబేటర్లలో ఉంచితే ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. తల్లీబిడ్డ విడివిడిగా పడుకోకూడదు. తల్లి పొత్తిళ్లలో బిడ్డ ఉంటే ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. పుట్టిన బిడ్డ బరువు 2500 గ్రాములు ఉండాలి. శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా ఉండాలి. తల్లులు బలవర్ధకమైన పాలు, గుడ్డు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం తగ్గితే అనారోగ్య సమస్యలు వస్తాయి. బాలింతలకు కారం కలిపిన అన్నం..కరివేపాకు పొడిని కలిపిన భోజనాన్ని తినిపించాలన్నది అపోహ మాత్రమే. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి నీరసపడతారు. ప్రతి ఒక్కరికీ రోజుకు 2500 క్యాలరీల ఆహారం అవసరం. గర్భిణులైతే 2800 క్యాలరీలు, బాలింతలైతే మూడు వేల క్యాలరీల భోజనం అవసరం. మునగాకుతో చేసిన కూరలు, క్యారెట్, పాలకూర, బంగాళా దుంపల్లో తగినంత కాల్షియం ఉంటుంది. హైపోథెర్మియాతో ప్రాణాపాయం : చలి ప్రభావం వల్ల పురిటి పిల్లలు హైపోథెర్మియా బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. జలుబు, తుమ్ములు, ఆస్తమా ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి. పిల్లలకు శరీరమంతా కప్పి ఉంచేలా దుస్తులు వేయాలి. ఆస్తమా బాధితులు మాస్క్‌లు కట్టుకోవాలి. స్కూల్‌కు వెళ్లే చిన్నారులు స్వెట్టర్లు వాడాలి. బయటి తిండికి దూరంగా ఉంటే మంచిది. వీలైనంత వరకు వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న పెద్దలకు చలి వాతావరణం ఇబ్బంది కలిగిస్తుంది. రక్త నాళాలు చలికి కుంచించుకుపోయి గుండె జబ్బులు ఉంటే త్వరగా ఉండె పోటు వచ్చే అవకాశం ఉంది. నిమోనియా, గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి. – డాక్టర్ హరిప్రసాద్, పీడియాట్రిక్ సర్జన్, చిన్నారి హాస్పిటల్, అనంతపురం. వారం రోజులుగా ఉష్ణోగ్రత వివరాలు తేదీ కనిష్ట ఉష్ణోగ్రత డిసెంబర్ 19 16.4 డిసెంబర్ 20 16.6 డిసెంబర్ 21 16.0 డిసెంబర్ 22 14.5 డిసెంబర్ 23 12.7 డిసెంబర్ 24 13.1 డిసెంబర్ 25 13.0 -
చలి చంపేస్తోంది..
చలి చంపేస్తోంది. వారం రోజులుగా జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8లోపు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో పోలాలకు వెళ్లే రైతులు, స్కూల్‌కు పోయే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చలిని తట్టుకోవడానికి మహిళలు, వృద్ధులు, వాహనదారులు రకరకాల వస్త్రాలతో శరీరాన్ని కప్పుకుని బయటకు వెళుతున్నారు. సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
చలి ‘మంట’
నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. రెండురోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఆదివారం కూడా కనిష్ట ఉష్టోగ్రత 12.5గా నమోదైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావడానికి జనం ఇబ్బందిపడుతున్నారు.