
చలి చంపేస్తోంది..
చలి చంపేస్తోంది. వారం రోజులుగా జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8లోపు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో పోలాలకు వెళ్లే రైతులు, స్కూల్‌కు పోయే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చలిని తట్టుకోవడానికి మహిళలు, వృద్ధులు, వాహనదారులు రకరకాల వస్త్రాలతో శరీరాన్ని కప్పుకుని బయటకు వెళుతున్నారు.
సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం