భారీ వర్షం
ఇందూరు :
జిల్లాలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. ఐదు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 19 మండలాల్లో సాధారణం, 12 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కమ్మర్‌పల్లి మండలంలో 42.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కోటగిరి మండలంలో 40.4 మిల్లీ మీటర్లు, కామారెడ్డిలో 35.6, బోధన్‌లో 34.0, సదాశివనగర్‌లో 31.2, జుక్కల్‌లో 29.6, బీర్కూర్‌లో 24.0, రెంజల్‌లో 23.8, మద్నూరులో 20, వర్నిలో 18.4, బిచ్కుందలో 16.4, మాక్లూర్‌లో 15.8, లింగంపేట్‌లో 15.6, నవీపేట్‌లో 15.4, ఎడపల్లిలో 12.2, నందిపేట్‌లో 12, తాడ్వాయిలో 11.4, మోర్తాడ్‌లో 11.4, గాంధారిలో 10.4, నిజాంసాగర్‌లో 9, దోమకొండలో 8.2, పిట్లంలో 8, బాల్కొండలో 4.4, నాగిరెడ్డిపేట్‌లో 3.2, భిక్కనూరులో 3, భీమ్‌గల్‌లో 2.2, ఆర్మూర్‌లో 2.8, మాచారెడ్డిలో 2.2, మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.