బీర కాదు.. ‘భీమ’ కాయలు
Published Mon, Sep 19 2016 9:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
గోగన్నమఠం (మామిడికుదురు):
సాధారణంగా దేశవాళీ రకం బీర కాయలు రెండు వందల నుంచి మూడొందల గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అంతకు మించి తూగడం చాలా అరుదు. అయితే గోగన్నమఠంలో భూపతిరాజు సతీష్‌రాజు ఇంటి పెరట్లో దేశవాళీ బీరపాదుకు కాసిన కాయల్లో కొన్ని కేజీ బరువు తూగుతున్నాయి. చూడ్డానికి తక్కువ పొడవు ఉన్నా వాటి బరువు మాత్రం భారీగా ఉండడం విశేషం. స్థానికులు ఈ బీరకాయలను ఆసక్తిగా చూస్తున్నారు. బీర కాయల ‘భీమ’ పరిమాణంపై ఉద్యాన శాఖాధికారి శైలజను సోమవారం ‘సాక్షి’ వివరణ కోరగా పెరట్లో మొట్టమొదటిసారిగా బీర పాదు పెట్టడం వల్ల అది భూమిలో ఉన్న పోషకాలను విరివిగా గ్రహించి అధిక బరువు గల కాయలు కాస్తోందన్నారు. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుందన్నారు.
Advertisement