హెలికాప్టర్ సందడి
చాగలమర్రి: అత్యంత కింద నుంచి హెలికాప్టర్ ప్రయాణిస్తూ చక్కర్లు కొట్టడంతో ప్రజలు చూసి సంతోషించారు. మంగళవారం మండలంలోని చిన్నవంగలి అటవీ ప్రాంతం నుంచి చాగలమర్రి, మల్లెవేముల, రాజోలి, గొట్లురు, పెద్దముడియం, జమ్మలమడుగు ప్రాంతాల్లో హెలికాప్టర్ కింద భాగాన పొడవాటి సర్వే పరికరంతో చక్కర్లు కొడుతూ కనిపించడంతో భూగర్భంలోని బాక్సైట్, యురేనియం నిక్షేపాల కోసం సర్వే నిర్వహిస్తుండవచ్చని మండల అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.