ఏపీఏటీ ఉద్యోగుల విభజనపై తేల్చండి | high court orders to ap and telangana cs | Sakshi
Sakshi News home page

ఏపీఏటీ ఉద్యోగుల విభజనపై తేల్చండి

Published Sat, Nov 26 2016 3:24 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

ఏపీఏటీ ఉద్యోగుల విభజనపై తేల్చండి - Sakshi

ఏపీఏటీ ఉద్యోగుల విభజనపై తేల్చండి

ఉభయ రాష్ట్రాల సీఎస్‌లకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఉద్యోగులు, ఆస్తుల విభజనపై తేల్చాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఓ స్థాయీ నివేదికను కూడా సమర్పించాలని వారికి స్పష్టం చేసింది. నవంబర్ నెలకు ఏపీఏటీ నిర్వహణ వ్యయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే నెల 19కి వారుుదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీఏటీ సమర్పించిన నిర్వహణ బిల్లులను స్వీకరించేందుకు ఏపీ సర్కార్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement