దేదీప్యం.. ఆదిదంపతుల నగరోత్సవం
ఆది దంపతుల నగరోత్సవం శనివారం దేదీప్యమానంగా సాగింది. దసరా ఉత్సవాలను పురష్కరించుకుని ఈ ఏడాది దసరా ఉత్సవాలలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మల్లేశ్వరాలయం నుంచి ప్రారంభమైన నగరోత్సవం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కనులపండువగా సాగింది. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళార్చన జరిగింది. కళార్చన తర్వాత ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, విజయేశ్వర ఆలయం, టోల్‌గేటు, ఘాట్ రోడ్డు మీదగా ఆలయ ప్రాంగణానికి చేరింది.
– విజయవాడ (ఇంద్రకీలాద్రి)