అనపర్తిలో భారీ అగ్ని ప్రమాదం | huge fire accident in east godavari district | Sakshi
Sakshi News home page

అనపర్తిలో భారీ అగ్ని ప్రమాదం

Published Sun, Apr 17 2016 1:56 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

huge fire accident in east godavari district

అనపర్తి: తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అనపర్తి మండలం రామవరం గ్రామంలోని దళితవాడలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 16 పూరిళ్లు దగ్ధమయ్యాయి.

ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు శరవేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. అనపర్తి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంట్లో వంట చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చి బాధితులను ఆదుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement