గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గొట్టిపాడులో భారీ చోరీ జరిగింది.
చిలకలూరిపేట(గుంటూరు): గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గొట్టిపాడులో భారీ చోరీ జరిగింది. గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో ప్రవేశించిన దుండగులు రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.