అమాయక రైతులపై అక్రమ కేసులా ?
Published Tue, Oct 18 2016 12:29 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ
కర్నూలు సీక్యాంప్: టీడీపీలోకి రాని కారణంగా అమాయక రైతులపై అక్రమ కేసులు బనాయించడం తగదని కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రఘుబాబుతో మట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఆర్.కొంతలపాడుకు చెందిన గొల్ల శ్రీనివాసులు, లక్ష్మిరెడ్డి, బోయ నగేష్, బోయ వసంతప్ప, బోయ నారాయణ, బోయ రంగన్నలను ఆదివారం అర్ధరాత్రి తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారని ఆర్డీవోకు తెలిపారు. టీడీపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఒత్తిడి మేరకు...ఇసుక తవ్వారన్న కారణం చూపి అరెస్ట్ చేశారన్నారు. ఇసుక తవ్వకాల్లో తహసీల్దార్ రిపోర్ట్ లేకుండా అధికార పార్టీ నేతలు చెప్పినట్టు అరెస్ట్‌లు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై... సీఐ మహేశ్వరరెడ్డి పిలిపించి ఆర్డీవో మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్ లేకుండా, రెవెన్యూ శాఖ ఫిర్యాదు లేకుండా రైతులను ఎలా అరెస్ ్ట చేస్తారనే ప్రశ్నకు సీఐ నీళ్లు నమిలారు.
Advertisement