తక్షణం స్పందించాలి
విజయవాడ :
స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహణపై క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి సాంకేతిక సిబ్బంది తక్షణం స్పందిం చాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు. స్థానిక సబ్–కలెక్టర్ కార్యాల యంలో శనివారం ఆయన ప్రజాసాధికారిత సర్వే తీరును కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసాధికారిత సర్వేలో సమగ్ర సమాచారం సేకరించడం ద్వారా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శనివారం మధ్యాహ్నం 2గంటల వరకు సుమారు 7లక్షల కుటుంబాలకు చెందిన 19,30,650 మంది కుటుంబసభ్యుల వివరాలు ఎన్యూమరేటర్లు సేకరించారని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎన్యుమరేటర్లకు, పర్యవేక్షకులకు తెలిపేందుకు 13 జిల్లాల ప్రతినిధులు విజయవాడ సబ్–కలెక్టర్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్ సిబ్బంది రెండు షిప్టుల్లో పని చేస్తారని, 24 గంటలు సేవలు అందిస్తారని తెలి పారు. క్షేత్రస్థాయిలో పాల్గొనే ఎన్యుమరేటర్లు 1800 500 11111 టోల్ ఫ్రీ నంబరుకు కాల్‌చేసి సమస్యలను నివృత్తిచేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 24,788 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారని, కంట్రోల్ రూమ్‌లో 50 మంది విధులు నిర్వర్తి స్తున్నారని ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు.