smart pulse
-
రీ సర్వే
- ఆన్లైన్లో కనిపించని 80 వేల మంది విద్యార్థుల వివరాలు – సరిపోలని ప్రజాసాధికారత సర్వే. చైల్డ్ఇన్ఫో జాబితా – ఇంటింటికీ వెళ్లనున్న టీచర్లు, సీఆర్టీలు, డీఎల్ఎంటీలు – ఈ నెల చివరినాటికి సర్వే పూర్తి చేయాలని ఆదేశం అనంతపురం ఎడ్యుకేషన్ : జీఎం లాస్య...ఈ అమ్మాయి హౌసింగ్‌బోర్డులోని 28–5–36 డోరు నంబర్లో ఉంటోంది. జే. గౌతంరాజ్ ఈ అబ్బాయి అగళి మండలం కేంద్రంలోని ఇందిరమ్మకాలనీలో ఉంటున్నాడు. ప్రజాసాధికారత సర్వేలో అధికారులు ఇంటింటికి వెళ్లినప్పుడు ఈ వివరాలు నమోదు చేశారు. వీరి ఆధార్ నంబర్ల ఆధారంగా ఆన్లైన్లో చూస్తే వీరు ఎక్కడ చదువుతున్నారు...ఎన్నో తరగతి చదువుతున్నారనే వివరాలు కనిపించడం లేదు. మరో వైపు చైల్డ్ఇన్ఫోలో వీరి పేర్లే లేవు. జిల్లాలో 80 వేలమందికి పైగా విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ క్రమంలో విద్యార్థుల లెక్కలు తేల్చడానికి ప్రభుత్వం రీ సర్వే చేపడుతోంది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రజాసాధికారత సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గతంలో విద్యాశాఖ చేపట్టిన చైల్డ్ ఇన్ఫో జాబితాలోని విద్యార్థుల వివరాలకు, ప్రస్తుతం ప్రజాసాధికారత సర్వేలో చేపట్టిన వివరాలకు పొంతన కుదరడం లేదు. జిల్లాలో సుమారు 80 వేలమంది పిల్లలు వివరాలు తేలడం లేదు. చైల్డ్ ఇన్ఫో జాబితాలోని విద్యార్థులకు సంబంధించి సమగ్ర వివరాలుంటాయి. అంటే విద్యార్థి పేరు, తండ్రి, తల్లి, వయసు, తరగతి, స్కూల్ పేరు, స్కూల్ యూడైస్ కోడ్, కులం, ఊరు, ఆధార్ నంబరు ఇలా...దాదాపు అన్ని వివరాలుంటాయి. మరి ప్రజాసాధికారత సర్వే జాబితాలో ఉన్న ఆధార్‌కార్డు నంబరు ఆధారంగా ఆన్లైన్లో చూస్తే 80 వేలమంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారనే వివరాలు రావడం లేదు. అంటే ఆధార్ నంబరును తప్పుగా నమోదు చేశారా..లేదంటే చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాకపోయి ఉండాలి. ఇంటింటికీ అయ్యవార్లు.. విద్యార్థుల లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం రీ సర్వే చేయాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీల ద్వారా ఈ నెలాఖరులోగా ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల వివరాలను సేకరించనున్నారు. ప్రజాసాధికారత సర్వే జాబితాను రెవెన్యూ గ్రామాల వారిగా రూపొందించారు. ఈ జాబితాను విద్యాశాఖకు పంపారు. జాబితా ఆధారంగా ఆధార్ నంబరు, డోర్ నంబరుకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి/అబ్బాయి ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నాడు...స్కూల్, తరగతి తదితర వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా నమోదు ఇందుకోసం ఏపీ జీఈఆర్ (ఆంధ్రప్రదేశ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) అనే యాప్‌ను ప్రభుత్వం కొత్తగా రూపొందించింది. సర్వేకు వెళ్లే టీచర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ల ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేశారు. యాప్ ఓపెన్ చేయగానే జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం వివరాలు వస్తాయి. వాటిని క్లిక్ చేయగానే రెవెన్యూ గ్రామంలో ఉన్న పిల్లలు, అడ్రస్, ఆధార్‌నంబర్ కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఆయా ఇళ్లకు వెళ్లి పిల్లలు ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నారు...ఎన్నో తరగతి చదువుతున్నారనే వివరాలను యాప్‌లోనే నమోదు చేస్తారు. ఈ యాప్ ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయడంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరతాయి. నెలాఖరులోగా పూర్తి కావాలి జిల్లాలో సుమారు 80 వేలమంది పిల్లలు వివరాలు ప్రజాసాధికారిత సర్వే, చైల్డ్ఇన్ఫో జాబితాకు సరిపోవడం లేదు. ప్రజాసాధికారత సర్వే జాబితా ఆధారంగా టీచర్లతో రీసర్వే చేయిస్తున్నాం. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మీనారాయణ, డీఈఓ -
సర్వే 'బంధనం'!
కొత్త కార్డుల మంజూరు స్మార్ట్‌పల్స్ సర్వేతో లింకు కీలకంగా మారనున్న ‘అనుసంధానం’ నిబంధనల మేరకు అర్హతలు ఉంటేనే మంజూరు ‘జన్మభూమి– మా ఊరు’లో పంపిణీ ఉండకపోవచ్చు జిల్లాలో 60 వేల మంది ఎదురుచూపు అనంతపురం అర్బన్ : అంతా భయపడినట్లే జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం ప్రజా సాధికార (స్మార్ట్ పల్స్) సర్వేతో లింక్ పెడుతోంది. సర్వే వివరాలను, దరఖాస్తులను అనుసంధానం చేయనుంది. సర్వే నిబంధనల మేరకు అర్హతలు ఉంటేనే రేషన్‌కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సర్వే ఇంకా పూర్తి కానందున జనవరిలో జరిగే ‘జన్మభూమి– మా ఊరు’ కార్యక్రమంలో కొత్త కార్డుల పంపిణీ ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 60 వేల మంది పేదలు ఎదురుచూస్తున్నారు. వీరి దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నారు. ఆరు అంచెల్లో దరఖాస్తుదారుని వివరాలను పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నట్లు గుర్తిస్తేనే కార్డు మంజూరు చేస్తారని సమాచారం. ఈ విధానంలో ఎక్కువ దరఖాస్తులపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. వాస్తవానికి సర్వే ద్వారా సేకరిస్తున్న సమాచారంతో రేషన్ కార్డులకు అర్హత కోల్పోతామని ఇప్పటికే పేదల్లో ఆందోళన ఉంది. సర్వే అనుసంధానం కీలకం ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారం కార్డుల మంజూరులో కీలకంగా మారుతుందని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఇదే జరిగితే పలువురికి రేషన్ కార్డులు మంజూరు కావు. రేషన్ కార్డు కావాలంటే ద్విచక్రవాహనం ఉండకూడదు. నెలసరి ఆదాయం రూ.11 వేలకు మించకూడదు. విద్యుత్ చార్జీ నెలసరి రూ.500 లోపు ఉండాలి. సొంత ఇల్లు 144 చదరపు అడుగులు మించి ఉండకూడదు. తాత్కాలిక/ ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు. వీటికి తోడు జన్మభూమి కమిటీ సిఫారసు ఉండాలి. ప్రస్తుతం పలువురు స్వయం ఉపాధి కోసం అప్పు చేసి ఆటోలు, ట్రాక్టర్లు, జీపులు, కార్లు వంటివి తెచ్చుకుని బాడుగలకు తిప్పుతున్నారు. వాహనాలు ఉన్నాయనే కారణంతో వీరు కార్డు పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. జన్మభూమిలో ఉండకపోవచ్చు ప్రజాసాధికార సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. సర్వే పూర్తయిన తరువాత వివరాలను అనుసంధానం చేస్తారు. అటు తరువాత దరఖాస్తుదారుల వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిశీలించాల్సి ఉంటుంది. సర్వేనే పూర్తి కానందున జనవరిలో జరగనున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో రేషన్ కార్డుల పంపిణీ ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
స్మార్ట్ పల్స్ సర్వేపై నిర్లక్ష్యం వద్దు
బుక్కరాయసముద్రం : ప్రజా సాధికారిక సర్వేలో రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తగదని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మండిపడ్డారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సాధికారిక సర్వేలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సర్వర్ పని చేయలేదని కుంటిసాకులు చెప్పొద్దని జేసీ అధికారులకు హితవు పలికారు. అదే విధంగా కొంత మంది సిబ్బంది వెబ్సైట్లో లాగిన్ కూడా కావడం లేదన్నారు. ప్రతి రోజూ సాయంత్రం డైలీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇస్తున్నా వాటిని అధికారులు నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తక్షణం స్పందించాలి
విజయవాడ : స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహణపై క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి సాంకేతిక సిబ్బంది తక్షణం స్పందిం చాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు. స్థానిక సబ్–కలెక్టర్ కార్యాల యంలో శనివారం ఆయన ప్రజాసాధికారిత సర్వే తీరును కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసాధికారిత సర్వేలో సమగ్ర సమాచారం సేకరించడం ద్వారా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శనివారం మధ్యాహ్నం 2గంటల వరకు సుమారు 7లక్షల కుటుంబాలకు చెందిన 19,30,650 మంది కుటుంబసభ్యుల వివరాలు ఎన్యూమరేటర్లు సేకరించారని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎన్యుమరేటర్లకు, పర్యవేక్షకులకు తెలిపేందుకు 13 జిల్లాల ప్రతినిధులు విజయవాడ సబ్–కలెక్టర్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్ సిబ్బంది రెండు షిప్టుల్లో పని చేస్తారని, 24 గంటలు సేవలు అందిస్తారని తెలి పారు. క్షేత్రస్థాయిలో పాల్గొనే ఎన్యుమరేటర్లు 1800 500 11111 టోల్ ఫ్రీ నంబరుకు కాల్చేసి సమస్యలను నివృత్తిచేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 24,788 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారని, కంట్రోల్ రూమ్‌లో 50 మంది విధులు నిర్వర్తి స్తున్నారని ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. -
సర్వే ‘స్మార్ట్’గా జరగాలి: ఆర్డీఓ
బలిజిపేట రూరల్: ఇంటింటా స్మార్ట్ సర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గోవిందరావు సూచించారు. ఆయన బలిజిపేటలో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం పరిశీలించారు. పి.శ్రీరాములు అనే ఎన్యూమరేటర్‌కు ఇచ్చిన 500 గృహాల సర్వేను నిర్వహిస్తుండగా పరిశీలించారు. సర్వేను ఏవిధంగా చేయాలనేది ఎన్యూమరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. సర్వే నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని సూపర్వైజర్లకు, అధికారులకు తెలిపారు. సిగ్నళ్లు, ట్యాబ్‌ల పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహశీల్దార్ బీవీ లక్షి్మ, ఎంపీడీఓ రాజు, ఏఎస్ఓ సురేష్, ఏపీఎం ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.