సర్వే ‘స్మార్ట్‌’గా జరగాలి: ఆర్డీఓ | survey should be smart says rdo | Sakshi
Sakshi News home page

సర్వే ‘స్మార్ట్‌’గా జరగాలి: ఆర్డీఓ

Published Mon, Jul 18 2016 6:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM

సర్వేను పరిశీలిస్తున్న ఆర్డీఓ గోవిందరావు

సర్వేను పరిశీలిస్తున్న ఆర్డీఓ గోవిందరావు

బలిజిపేట రూరల్‌: ఇంటింటా స్మార్ట్‌ సర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గోవిందరావు సూచించారు. ఆయన బలిజిపేటలో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం పరిశీలించారు. పి.శ్రీరాములు అనే ఎన్యూమరేటర్‌కు ఇచ్చిన 500 గృహాల సర్వేను నిర్వహిస్తుండగా పరిశీలించారు. సర్వేను ఏవిధంగా చేయాలనేది ఎన్యూమరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. సర్వే నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని సూపర్‌వైజర్లకు, అధికారులకు తెలిపారు. సిగ్నళ్లు, ట్యాబ్‌ల పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ బీవీ లక్షి్మ, ఎంపీడీఓ రాజు, ఏఎస్‌ఓ సురేష్, ఏపీఎం ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement