తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలి
తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలి
Published Sun, Oct 2 2016 10:57 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
మఠంపల్లి : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు, రుణమాఫీ పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర రైతాంగం సమస్యలను చర్చించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీని సమావేశ పర్చాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డి కోరారు. ఆదివారం మఠంపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె స్థానికంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ చివరి వారంలో అసెంబ్లీని సమావేశపరుస్తానని నిండు సభలో ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రజా సమస్యల చర్చకు ఉపక్రమించకపోవడం సరికాదన్నారు. భారతసైన్యంలో వాయుసేనలో పనిచేసిన తన భర్త పీసీసీ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి యుద్ధ విమానాలు నడిపారన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధమంటూ వస్తే వయసుతో సంబ«ంధం లేకుండా యుద్ధంలో పాల్గొంటానని ప్రకటించడం తనకెంతో గర్వంగా ఉందని.. ఈ ప్రకటనను తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. సమావేశంలో మంజీనాయక్, రాజారెడ్డి, స్రవంతికిషోర్‌రెడ్డి, గాలిచిన్నపరెడ్డి, బాలగురవయ్య, రవినాయక్, నవీన్‌నాయక్, బాబునాయక్, శ్రీనివాసరెడ్డి, కిషన్‌నాయక్, వంటిపులిశ్రీను, కృష్ణయ్య ఉన్నారు.
Advertisement
Advertisement