- విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్
- జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ
సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి
Published Thu, Sep 29 2016 12:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
నమిలిగొండ (స్టేషన్‌ఘన్‌పూర్) : విద్యార్థులు చదువుతోపాటు సైన్స్ ప్రయోగాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి. పద్మ అన్నారు. మండలంలోని నమిలిగొండ శివారు ఆదర్శ పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయని చెప్పారు. డీఈఓ పెగడ రాజీవ్ మాట్లాడుతూ ఇన్‌స్పైర్ నిర్వహణకు నాలుగు కేటగిరీల్లో 16 కమిటీలు పనిచేస్తున్నాయన్నారు. నిట్, కాకతీయ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మొదటి రోజు ప్రదర్శనకు జనగామ డివిజన్ నుంచి 107, ములుగు నుంచి 88, వరంగల్ నుంచి 76, నల్లగొండ నుంచి 16 ఎగ్జిబిట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. అనంతరం ఇన్‌స్పైర్-2015 జాతీయ స్థాయిలో ప్రదర్శన ఇచ్చిన నవ్యశ్రీ,, కుమార్, నితిన్, క్రాంతికుమార్‌కు జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు మెమోంటోలు అందజేశారు. అలాగే రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన మొక్కల రక్షణ కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కేశవరావు, జనగామ డిప్యూటీ ఈఓ యాదయ్య, జెడ్పీటీసీ సభ్యుడు స్వామినాయక్, ఎంపీపీ జగన్‌మోహన్‌రెడ్డి, నమిలిగొండ సర్పంచ్ మల్కిరెడ్డి ఆగారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పులి యాకయ్య, ఎండీ దస్తగిరి, రాజేందర్, రాంచంద్రారెడ్డి, సంపత్‌కుమార్, ప్రేమానందరెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీకాంత్, మీడియా ఇన్‌చార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement