‘పది’లో ఉత్తీర్ణత శాతం పెంచాలి | increase the pass percentage of tenth class | Sakshi
Sakshi News home page

‘పది’లో ఉత్తీర్ణత శాతం పెంచాలి

Published Tue, Jan 10 2017 10:29 PM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM

‘పది’లో ఉత్తీర్ణత శాతం పెంచాలి - Sakshi

‘పది’లో ఉత్తీర్ణత శాతం పెంచాలి

డీఈవో వెంకటేశ్వర్‌ రావు
ధర్మారం : ఈ ఏడాది పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచుటకు ఉపాధ్యాయులు అదనంగా శ్రమించాలని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. ధర్మారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కేసీఆర్‌ సేవాదళం రాష్ట్ర సలహాదారుడు రమేష్‌చారి ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు అందిస్తున్న స్నాక్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఈవో వెంకటేశ్వర్‌రావు, మండల విద్యాధికారి పద్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ  విద్యార్థులకు  స్నాక్స్‌ అందిస్తున్న రమేష్‌చారిని అభినందించారు. విద్యార్థులు అంకితభావంతో చదివి ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించేందుకు ప్రయత్నించాలన్నారు.

కేసీఆర్‌ సేవా దళం రాష్ట్ర సలహాదారు రమేష్‌చారి మాట్లాడుతూ తమ సేవా సంస్థ ద్వారా ఇప్పటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.కటికెనపల్లి, ధర్మారం పాఠశాలల్లోని విద్యార్థులకు స్నాక్స్‌తో పాటుగా మంచినీటి వసతి కల్పించుటకు తమ వంతుగా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పద్మ, ఎంపీటీసీ సభ్యుడు బొల్లి స్వామి, తెలంగాణ ఉపాధ్యాయసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రంగారావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement