
ఉత్సాహంగా ఇరుసు పోటీలు
పట్టణంలో మంగళవారం పామిడమ్మ తేరును పురస్కరించుకొని గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరుసు ఎత్తే పోటీలు ఉత్సాహంగా సాగాయి.
పామిడి: పట్టణంలో మంగళవారం పామిడమ్మ తేరును పురస్కరించుకొని గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరుసు ఎత్తే పోటీలు ఉత్సాహంగా సాగాయి. వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు పోటాపోటీగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలుగా కూడేరు మండలం అరవకూరు గ్రామస్తుడు నారాయణ, నార్పల మండలం కేకే అగ్రహారం గ్రామానికి చెందిన రాజు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. వారికి ప్రథమ బహుమతిగా 5 తులాల వెండి, ద్వితీయ బహుమతిగా 3 తులాల వెండిని నిర్వాహకులు మంటిమడుగు శీనా, రవి, తొండపాడు రంగనాయకులు, శీనా అందజేశారు.