ఐటీఐ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఆర్‌ఓ
Published Sun, Aug 7 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
పోచమ్మమైదాన్ : ములుగురోడ్‌లోని వరంగల్ ప్రభుత్వ ఐటీఐ పరీక్షా కేంద్రాన్ని డీఆర్ ఓ శోభ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పరీక్ష కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించారు. పరీక్షలలో మాస్ కాíపీయింగ్ సాగుతుందని పలువురు కలెక్టర్ కరుణకు ఫిర్యాదు చేయడంతో స్పందించి వెంటనే డీఆర్‌ఓను వెళ్లి తనిఖీ చేయమని ఆదేశించారు. శనివారం ఉదయం పరీక్ష ప్రారంభం కాగానే డీఆర్‌ఓ వచ్చి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ ఐటీఐలో రాజీవ్‌గాంధీ, హన్మకొండ ప్రభుత్వ ఐటీఐలలో చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 350 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అనంతరం శోభ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాను సారం పరీక్షకేంద్రంను తనిఖీ చేశానని చెప్పారు. ఎలాంటి మాస్‌కాపీయింగ్ జరగడం లేదని స్పష్టం చేశారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ రేణుక, ఆర్‌ఐ శర్మ, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
Advertisement