
దుర్గమ్మ సన్నిధిలో జబర్దస్త్ బృందం
ఇంద్రకీలాద్రి: సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్... శనివారం దుర్గగుడికి వచ్చారు. జబర్దస్త్ టీం సభ్యులైన వీరంతా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ప్రసాదాలను అందచేశారు. దర్శనానంతరం రాజగోపురం వద్దకు చేరుకున్న నటులతో పలువురు భక్తులు సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు.